28.2 C
Hyderabad
Saturday, March 2, 2024
spot_img

నితీశ్ రాజకీయాల్లో కూటమికి పోటు …సీఎం పదవికి పాటు

           నితీశ్ కుమార్ రాజకీయ సమీకరణల్లో పరిస్థితులను అంచనా వేయడంలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. యూటర్న్‌లు తీసుకోవడంలో బీహార్ బాబుతో పోటీ పడే నాయకుడు లేడంటే అతిశయోక్తి కాదు.ప్రగతి మాట ఎలా ఉన్న పదవిని అంటిపెట్టుకుని ఉండడంలో ఆయన రూటే సపరేట్. ఏకంగా తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన ఘనతను సొంతం చేసుకున్న ఘనాపాటి. రాజకీయ భీష్ముడుగా పేరుగాంచిన నితీశ్. గత పదేళ్లలో ఐదు సార్లు కూట మి మార్చారు నితీశ్. రాజకీయ చరిత్రలో రంగులు మార్చే ఊసరవెల్లిగా అపప్రథను మూటగట్టుకున్నారు. అదే సమయంలో సమయస్ఫూర్తితో సీఎం కుర్చీ ఎక్కడంలో నితీశ్ ది అందవేసిన చేయి.

        రాజకీయ చతురంగ బలాల్లో వ్యూహాలు ఎత్తుగడలు ఉంటేనే ఎవరికైనా గెలుపు సాధ్యం. దశాబ్ద కాలం ఎన్డీయేతో ఉన్న అనుబంధాన్ని కాదనుకుని 2013లో నితీశ్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడే అందరూ ఆశ్చర్యపో యారు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుని అదే పార్టీతో జతకట్టి నితీష్ మరోసారి సీఎం పీఠమెక్కారు. రాజకీయ తం త్రంలో నితీశ్ వేసిన ప్రతి అడుగు సక్సెస్. గతంలో ఇవే నాకు చివరి ఎన్నికలు అని చెప్పి ప్రజల అభిమానాన్ని చూరగొ న్నారు.ఇలా ఎప్పటికప్పుడు ఏదో వ్యూహంతో నితీశ్ సీఎం పీఠం ఎక్కడంలో చరిత్ర సృష్టించారు…మరో సరికొత్త అధ్యా యానికి తెరతీశారు. ఫైట్ ఫర్ రైట్ కన్నా ఫైట్ ఫర్ సీట్ అనే సిద్ధాంతానికి నితీశ్ అక్షరాల సరిపోతాడని జాతీయ మీడి యా తేల్చి చెప్పింది. మన దేశానికి తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం బీహార్. పాట్నా రాజధాని వేదికగా ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను యావత్ దేశం ఉత్కంఠతతో చూసేలా చేశాయి. జేడీయూ అధినేత బీహార్ సీఎం రాజీనామా తో అనేక నాటకీయ పరిణామాల తర్వాత నయా ప్రభుత్వం కొలువుదీరింది. రాజభవన్ లో నితీశ్ తోపాటు ఇద్దరు బీజేపీ డిప్యుటీ సీఎంలతో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ ఆర్లేకర్. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , కేంద్ర మంత్రి అమిత్ షా ఇతర నేతలు హాజరయ్యారు.

        బీహార్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 243 కాగా… ఆర్జేడీ-79, బీజేపీ -78, జేడీయూ-45, కాంగ్రెస్‌-19, సీపీఐ (ఎం-ఎల్‌)-12, హెచ్‌ఏఎం-4, సీపీఎం, సీపీఐలకు ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎంకు ఒకరు, స్వతం త్ర ఎమ్మెల్యే ఇంకొకరున్నారు. జేడీయూ, బీజేపీ, హెచ్‌ఏఎం కలిస్తే వారి బలం 127కి చేరుతుంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇతర సభ్యులు కలిసినా వారి సంఖ్య 116కు మించలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు సరిపోతుంది. ఈ నేపథ్యంలో నితీశ్‌ మరోసారి తన రాజనీతిజ్ఙను చాటుకున్నారు. బీహార్ సీఎం పీఠం దక్కించుకోవడంలో కృతకృత్యులయ్యారు.ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్రనేతలు బీజేపీతో నితీశ్ పొత్తు ఎంతో కాలం నిలవదని శాపనార్థాలు పెడుతున్నారు. నితీశ్ విషయంలో ఈసారి బీజేపీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోందని జతీయ మీడియా పేర్కొంది. ఎప్పటికప్పుడు రాజకీయ రంగులు మార్చే నితీశ్ ని బీజేపీ అధిష్టానం కూడా నమ్మే స్థితిలో లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నితీశ్ తోక జాడిస్తే ఏంటనే విషయంలో ఎన్డీయే కూటమి ఇప్పటికే ప్లాన్ బి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే ఈసారి బీజేపీదే పైచేయి ఉండేలా జాగ్రత్తపడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

       ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, అంకెల గేమ్‌లో ఏదైనా అవకతవక లు జరిగితే, బ్యాకప్ ప్లాన్ సిద్ధంగా ఉందని వార్తలు పొక్కాయి. అదే సమయంలో, ప్రభుత్వ ఏర్పాటుకు ముందు, బీజేపీ తన మునుపటి మిత్రపక్షాలైన చిరాగ్ పాశ్వాన్, జితన్ మాంఝీలను కూడా బరిలోకి దించాలనే ప్రయత్నం జరిగింది. ఈ విషయాలన్నింటిపై బీజేపీ తరపున అమిత్ షా జేపీ నడ్డా సహా పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు.ఇదిలా ఉంటే నితీష్ కుమార్ సహా మిత్రపక్షాలందరికీ లోక్ సభలో ఎలాంటి వాటా ఇస్తారనే దానిపై చర్చ కూడా జరిగిందని తెలుస్తోంది. బీహార్ ఎన్డీయే సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేదిశగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నీతీక్ కుమార్, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేసిన సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలకు అభినందనలు తెలిపారు. ఈ కొత్త బృందం రాష్ట్రంలోని ప్రజలందరికీ నిబద్ధతతో సేవలందిస్తుందన్న నమ్మకం ఉందని ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.

       మిత్రపక్షాలను మార్చడం ద్వారా బిహార్లో సుదీర్ఘ కాలంగా అధికారంలో కొనసాగుతున్న నీతీశ్ కుమార్…భాజపాకు వ్యతిరేకంగా కూటమి కట్టి..మిత్రపక్షాలను మార్చడం ద్వారా బిహర్లో సుదీర్ఘ కాలంగా అధికారంలో కొనసాగుతున్న నీతీశ్ కుమార్.. భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. పాట్నా వేదికగా విపక్షాలను ఏకతాటి పైకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే, ‘ఇండియా’ కూటమి కన్వీనర్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికైనప్పటి నుంచి నీతీశ్ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపించా యి. ఈ క్రమంలోనే ‘ఇండియా’ కూటమిని వీడి తిరిగి ఎన్డీయే గూటికి చేరి తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకా రం చేశారు.

         నితిశ్ కుమార్ బీహార్ లో సుదీర్ఘ కాలంపాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గా పేరు గడించారు. 2005 నుంచి వివిధ పార్టీలతో జతకట్టి అత్యధికంగా తొమ్మిది సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. దాదాపు 18 ఏళ్లలో ఆయన బీజేపీతోనూ, ఆర్జేడీ- కాంగ్రెస్, వామపక్షాలతో జతకట్టడం ద్వారా అధికారంలో కొనసాగారు. ఇప్పుడు ఎన్డీ ఏలో చేరి, మరోసారి బీజేపీ- జేడీయూ కూటమి చీఫ్ గా సీఎం గద్దె ఎక్కారు. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మీద కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తరచూ రాజకీయ భాగస్వాములను మార్చే నితీశ్ కుమార్ .. రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. బిహార్ ప్రజల అభీష్టాన్ని ఆయన విస్మరిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రను చూసి ప్రధానమంత్రి మోదీతోపాటు బీజేపీ భయపడుతోందన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నాటకీయ పరిణామాలకు తెరతీశారని విమర్శించారు.

Latest Articles

పాలమూరు – రంగారెడ్డిపై కాంగ్రెస్ ఆరోపణలు

   దక్షిణ తెలంగాణ వరదాయనిగా పేరొందిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కరువుసీమగా పేరున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటిని పారించే ప్రధాన లక్ష్యంతో ప్రారంభించిన పాలమూరు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్