TSPSC ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో.. న్యాయసలహాలు తీసుకు న్న అనంతరం ఇవాళ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గత ఛైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ భవిష్యత్‌లో ఆటలాడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సభ్యుల రాజీనామాల ఆమో దంతో త్వరలో కొత్త కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయినా TSPSC ఫలితాలు ప్రకటించలేదు.