23.2 C
Hyderabad
Thursday, February 19, 2026
spot_img

జనసేన అధినేతకు పొత్తులపై క్లారిటీ వచ్చినట్టేనా ?

       ఏపీలో పొత్తుల వ్యవహారంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని  ప్రకటించారు. అదే సమ యంలో పొత్తుల్లో ఒక మాట అటూ ఇటు ఉంటుందని.. ఎవరెన్ని చెప్పినా ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై తనకు ఓ క్లారిటీ ఉందంటూ తేల్చి చెప్పారు జనసేన అధినేత. ఇంతవరకు బాగానే ఉన్నా.. మరి పవన్‌తో పొత్తులో ఉన్న కమలనాథుల సంగతేంటి అన్నది ఆసక్తి రేపుతోంది.

       ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుతోంది. ఓవైపు ఇంఛార్జ్‌ల మార్పులు చేర్పుల పేరుతో అసెంబ్లీ, పార్ల మెంటుకు పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వెళుతోంది అధికార వైసీపీ. ఈ క్రమంలో పలువురు అసంతృ ప్తి నేతలు పార్టీని వీడుతున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్లనున్నట్లు మరోమారు విస్పష్టంగా ప్రకటించారాయన. తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడం వల్ల బలవంతులమవుతామన్న ఆయన.. రానున్న రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుం దని ప్రకటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పవన్.. కార్యకర్తలతో మాట్లాడుతూ పలు కీలక అంశాలపై స్పందించారు. సీట్ల సర్థుబాటు పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని. పొత్తులో భాగంగా ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసంటూ చెప్పుకొచ్చారు. కొందరు 50 తీసుకోండి…60 తీసుకోండి అని చెబుతున్నారని… ఇవేమీ తెలియకుండా రాజకీయాల్లోకి వచ్చానని అనుకుంటున్నారా అంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఏం జరిగిందో చూశామని చెప్పిన ఆయన.. సింగిల్‌గా వెళ్లే సీట్లు వస్తాయి కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని అన్నారు పవన్.

       రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తాను మౌనంగా ఉంటున్నట్లు తెలిపారు పవన్ కల్యాణ్. అందువల్లే నారా లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా పట్టించుకోలేదన్నారు. పొత్తులన్నవి ఉన్న తర్వాత కొన్ని అనుకోని పరిణామా లు, సంఘటనలు జరుగుతాయని… వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరుతున్నా అంటూ వెల్లడించారాయన. అదే సమయంలో పార్టీ నేతల నుంచి తనపై విపరీతంగా ఒత్తిడి ఉన్న విషయాన్ని బయటపెట్టిన పవన్…రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే విషయంపై తప్ప ని పరిస్థితుల్లోనే ప్రకటన చేస్తున్నానంటూ వెల్లడించారు. టీడీపీ-జనసేన పొత్తు వరకు బాగానే ఉంది కానీ, మరి బీజేపీ సంగతేంటి అన్న దానిపై మాత్రం ఇంకా ఓ స్పష్టత రాలేదు. ఓవైపు జనసేన టీడీపీతో పొత్తులో ఉంది. అదే సమయంలో జనసేన తమతో పొత్తులో ఉన్నట్లు చెబుతున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు, జాతీయ నేతలు. ఈ నేపథ్యంలో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా.. ఉండదా…అసలు ఈ మాడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళతాయా లేక మరో వ్యూహం ఏమై నా ఉందా అన్నదానిపై ఇప్పటివరకు ఓ క్లారిటీ లేని పరిస్థితి నెలకొంది.

       ఓవైపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారం వస్తుందన్న ప్రచారం జోరుగా సాగు తోంది. దీనిపై ఇప్పటికే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు సైతం చేశారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూ లు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఆ రకంగా చూసుకుంటే… ఇప్పటి వరకు ఈ మాడూ పార్టీల పొత్తుపై ఓ క్లారిటీ రాని నేపథ్యంలో కేడర్‌లో మాత్రం అయోమయం నెలకొందన్న వాదన విన్పిస్తోంది. దీనిపై త్వరలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం. ఏ విషయం అన్నది తేలితే.. ఆ తర్వాత సీట్ల సర్థుబాటు, అభ్యర్థుల ప్రకటన, ఉమ్మడి మేనిఫెస్టో ఇలా ఒకదాని వెంట మరోటిగా ఆయా పనులు పూర్తి చేయనున్నా యి విపక్ష పార్టీలు. మరి ఈ మొత్తం వ్యవహారంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందన్నది అతి త్వరలోనే తేలనుంది. టీడీపీ-జనసేన పొత్తుపై అధికార వైసీపీతోపాటు ఎవరెన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కార్యకర్తలు మాత్రం అర్థం చేసుకోవాలని సూచించారు పవన్ కల్యాణ్. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పొత్తు అనివార్యమని చెప్పిన ఆయన.. అసెంబ్లీ
ఎన్నికల వరకు మాత్రమే పొత్తు పరిమితం కాదని.. సుదీర్ఘకాలం పాటు సాగుతుందని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. దీంతో… టీడీపీ జనసేన పొత్తుపై బయట జరుగుతున్న ప్రచారానికి పుల్‌స్టాప్‌ పడినట్లైందన్న
అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్