ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గంగలూరు అడవుల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.