Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

చైనా మాయలో పడ్డ మాల్దీవులు

       చైనా మాయలో మాల్దీవ్స్ పూర్తిగా పడింది. చైనా మాటలు నమ్మి భారత్‌తో దశాబ్దాలుగా ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసుకుంది పర్యాటకదేశం. టూరిజం ద్వారా మాల్దీవులకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసింది భారత్‌. రాజకీ యంగానూ గతంలో మాల్దీవులకు సాయం చేసింది మనదేశం. వాస్తవానికి మాల్దీవుల స్వాతంత్య్రాన్ని గుర్తించిన తొలి దేశాల్లో భారతదేశం ఒకటి. అయితే చైనా మాటలు నమ్మి భారత్ వ్యతిరేక వైఖరి తీసుకుంది ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న ప్రభుత్వం.

      భారత్- మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతినడం యాధృచ్ఛికంగా జరిగింది కాదు. రెండు దేశాల మధ్య డ్రాగన్ చైనా చిచ్చు పెట్టింది.. ఆసియాలో చైనా కొంతకాలంగా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగా భారత్ చుట్టూ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. చైనాకు ఈ ఆట కొత్త కాదు. మొదట పాకిస్తాన్‌తో చైనా ఈ ఆట మొదలెట్టింది. పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా తీసేదాకా చైనా సర్కార్ నిద్రపోలేదు. పాకిస్తాన్ రోడ్డున పడ్డాక, ఆ దేశాన్ని వదిలేసింది. ఆ తరువాత శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్ ఇలా అన్ని దేశాలపై డ్రాగన్ చైనా కన్నేసింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈ దేశాలకు భారీ ఎత్తున సొమ్ములు ఇస్తామని ఆశ పెట్టి తన శిబిరంలోకి లాక్కునే ప్రయత్నాలు చైనా చేస్తోంది.

       ఇదిలా ఉంటే, ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని మొదటినుంచి భారత్ వ్యతిరేకిస్తోంది. ఇది ప్రపంచదేశాలన్నిటికీ తెలిసిన విషయమే. దీంతో వ్యూహాత్మకంగా భారత్ – మాల్దీవుల మధ్య చిచ్చు రాజేసింది చైనా సర్కార్. వాస్తవానికి మాల్దీవులు, మొదటినుంచి భారత్‌కు మిత్ర దేశమే. మాల్దీవులు, ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడ్డ దేశం. మాల్దీ వులకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి టూరిస్టులు వెళుతుంటారు. అయితే మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో ఎక్కువ మంది భారతీయులే. ఆ విధంగా మాల్దీవుల ఆర్థికాభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ప్రతి ఏడాది జరుగుతున్నదే.

       టూరిజం ద్వారా మాల్దీవులకు ఆర్థిక సాయం చేయడంతో సరిపెట్టుకోలేదు భారతదేశం. రాజకీయంగానూ గతంలో మాల్దీవులకు భారత్ సాయం చేసింది. వాస్తవానికి మాల్దీవుల స్వాతంత్య్రాన్ని గుర్తించిన తొలి దేశాల్లో భారత్ ఒకటి. 1988లో మాల్దీవుల అధ్యక్షుడిపై తిరుగుబాటు జరిగినప్పుడు, భారత్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ కాక్టస్ పేరిట అప్పటి తిరుగుబాటును భారత సైన్యం అణచివేసింది. ఇలా అన్నివిధాలుగా మాల్దీవులకు అండగా నిలిచింది భారతదేశం. అయితే మాల్దీవ్స్, గతంలో భారత్ చేసిన సాయాన్ని మరచిపోయింది.

      భారత్‌ – మాల్దీవుల మధ్య కిందటి ఏడాది నవంబరు వరకు మంచి సంబంధాలే ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం భారత్‌తో స్నేహపూర్వకంగానే వ్యవహరించేది. అయితే మెల్లమెల్లగా మాల్దీవుల రాజకీయాల్లో డ్రాగన్ చైనా జోక్యం ప్రారంభమైంది. కొంతకాలానికి చైనా జోక్యం పెరగడం ప్రారంభమైంది. దీని ఫలితంగా మాల్దీవులు, భారత్ వ్యతిరేక వైఖరి తీసుకోవడం మొదలైంది. ఈ నేపథ్యంలో భారత్‌ – మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతినడం ప్రారంభమైంది. ఇక్కడ డ్రాగన్ కుయుక్తులను అర్థం చేసుకోవడం అవసరం. ఆసియాలో చైనా నియంతృత్వ పోకడలు పోతోంది. అయితే చైనా పెత్తందారీతనాన్ని భారత్ అడుగడుగునా అడ్డుకుంటోంది. దీంతో భారత్‌ను డ్రాగన్ చైనా టార్గెట్ చేయడం ప్రారంభించింది. భారతదేశాన్ని రాజకీయంగా దెబ్బతీయడమే చైనా లక్ష్యంగా పెట్టుకుంది. 2023 నవంబరు తరువాత మాల్దీవుల రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. నవంబరు ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ ….పీపీఎం పార్టీ విజయం సాధించింది. మహమ్మద్ మయిజ్జు దేశ అధ్యక్షుడయ్యారు. మహమ్మద్ మయిజ్జుకు ముందున్న ప్రభుత్వం భారత్‌కు అన్నివిధాల అనుకూలంగా ఉండేది.

       ముయిజ్జు ప్రభుత్వం, గత సర్కార్‌కు భిన్నంగా వ్యవహరించడం మొదలెట్టింది. నూటికి నూరు శాతం భారత్ వ్యతిరేక వైఖరి అవలంబించడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే మాల్దీవులకు రక్షణగా ఉన్న భారత సైన్యాన్ని వెనక్కి వెళ్లాలని కోరింది. అప్పటి నుంచి భారత్ – మాల్దీవులు మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్‌ను కించపరుస్తూ ముగ్గురు మాల్దీవుల మంత్రులు చిల్లర వ్యాఖ్యలు చేసి పదవులు పోగొట్టుకున్నారు. వివాదం ముదరడంతో చివరకు మాల్దీవులకు భారత్ నుంచి టూరిస్టులు కరువయ్యారు. దీంతో పర్యాటకులు లేక మాల్దీవులు ఆర్థికంగా దివాళా దెబ్బతిన్నది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్