కేంద్ర ప్రభుత్వం చెరకు మిల్లులు చెల్లించాల్సిన కొనుగోలు ధరను క్వింటాలుకు 340 రూపాయలు పెంచింది. 2024-25 సీజన్ లో చెరకు గిట్టుబాటు ధర ను క్వింటాలుకు రూ.25 నుంచి రూ.340 వరకు పెంచేందుకు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. చెరకు FRPని క్వింటాలుకు రూ.315 నుంచి రూ.340కి పెంచి, రికవరీ రేటును 10.25 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకు కు నిర్ణయించిన FRP కంటే కొత్త ధర 8 శాతం ఎక్కువ. పెంచిన FRP అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఫెయిర్, రెమ్యునరేటివ్ ప్రైస్ అనేది చెరకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధర. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.


