చెన్నై స్కూళ్లలో బాంబులు పెట్టారనే బెదిరింపు ఈ మెయిల్ రావడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అర్థాంతరంగా స్కూళ్లు మూసివేశారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్కూళ్లకు వచ్చి విద్యార్థులను తీసుకెళ్లారు. కనీసం నాలుగు ప్రైవేటు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. పోలీసులు బాంబులను కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను, పోలీసు జాగిలాలను కూడా రంగంలో దించి, స్కూళ్లను తనిఖీ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనలకు గురికారాదన పోలీసు అధికారుల తెలిపారు. ఈ మెయిల్ అందుకున్న స్కూళ్ల వద్ద పెద్దఎత్తున పోలీసులను మోహ రించారు. ఏ స్కూళ్లలోనూ ఎలాంటి బాంబ్ కన్పించలేదు. ఈవిద్యా సంస్థల్లో తనిఖీలకు జిసిపీ, బిడిడిఎస్ బృందాలను తరలించారు. ఈ మెయిల్ పంపిన దుండగులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.


