26.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

చంద్రగిరి నియోజకవర్గ రాజకీయ చరిత్ర

    ఆ నియోజకవర్గం ఓవైపు ఆధ్యాత్మికతకు, మరోవైపు వ్యవసాయానికి, మరో రంగంలో రాచరిక పాలనకు పెట్టింది పేరు. రతనాలు, వజ్ర వైఢూర్యాలు, నగలు ఇలా ఒకటి ఏంటి చెప్పుకుంటూ పోతే కోకొల్లలు రోడ్లపై రాశులుగా పోసి అమ్మేవారు. అంతటి పేరెన్నిక గల ఆ దుర్గం నేడు ఎలా ఉంది? ఎలాంటి పాలకులు అక్కడ రాజ్యమేలుతున్నారు? ప్రజలు బాగోగులు ఏంటి? సకల సౌభాగ్యాలతో తులతూగుతున్నారా లేదా?

వెయ్యవ శతాబ్దం కార్వేటినగరం రాజులు ఇమ్మడి యాదవ నరసింహులు తర్వాత సామంత రాజులు చంద్రగిరి దుర్గాన్ని పరిపాలించారు. తరువాత విరూపాక్ష రాయలు ఆ తరువాత రెండవ బుక్క రాయలు, మొదటి దేవరాయలు ఒక 1,422 చివరన పరిపాలన కొనసాగించారు. చరిత్రను చూసుకున్నట్లయితే 1509 లో ప్రారంభమై 1,529 వరకు శ్రీకృష్ణదేవరాయల పాలన కొనసాగింది. చంద్రగిరి మజ్జిగ ఆంధ్రదేశమున పేరు ప్రఖ్యాతలుగాంచిన రాజధాని. పురాణ గాధలను అనుసరించి ఇక్కడ ఎత్తైన ఒక కొండపై చంద్రుడు తపస్సును ఆచరించి శివుని ప్రసన్నము చేసుకొని వరములను పొందాడని, అందుచేత ఆనాటి నుండి చంద్రగిరి అను పేరు పొంది ప్రాచీనతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నందు తిరుపతి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రము తిరుపతికి దక్షిణ దిశగా 14 కిలోమీటర్ల దూరమున నెలకొని ఉంది. ప్రకృతి రమణీయత సుందర లోకంలో శత్రు దుర్భేద్యమైన దుర్గము చంద్రగిరి. అతి గంభీరము గల రాజా ప్రసాదములు, దేవాలయములో అతి సొంపైన తటాకాలు, సిలా మండపములు, తోరణాలతో విజయనగర సామ్రాజ్య ప్రభువుకు మూడవ రాజధాని నగరమై విరాజిల్లున్నది. కొన్ని ఆధారాలు శిధిలమైన విజయనగర యుగము నాటి సంస్కృతి వైభవమునకు సజీవ మూర్తులుగా నిలచిన రాజమహల్ మరియు రాణి ప్రాకారములు ఇతర కట్టడాలు చూపర్లను ఆకట్టుకొనుచున్నవి. ఆనాటి దేవాలయాలు మండపాలు శిథిలావస్థకు చేరుకున్నవి. క్రీస్తుశకం 1000 సంవత్సరాల ఎందు చంద్రగిరి పట్టణానికి అతి సమీపమున ఉన్న నారాయణ మనము పరిపాలించిన ఇమ్మడి యాదవ నరసింహ రాయలచే చంద్రగిరి కోట నిర్మించబడింది. కోట చుట్టూ ప్రకారము అనుసరించి పెద్ద పెద్ద కట్టడాలతో నిర్మించబడిన నలుదిక్కుల బురుజులు ఉన్నవి. దుర్గానికి ఇరువైపులా ప్రవేశ ద్వారాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నవి. చరిత్ర ప్రకారం చంద్రగిరి కోట 314 సంవత్సరాలు యాదవ రాజుల ఆధీనంలో ఉండేవి. అటు తరువాత విజయనగర సామ్రాజ్య సార్వభౌమత్వము సాల్వంశీయుల ఆధీనంలోనికి వచ్చాయి. సాల్వ వంశపు ప్రభువు నరసింహారాయులు చాలా కాలము చంద్రగిరి ప్రాంతమునకు ప్రభువుగా ఉండి చంద్రగిరి కోట నందు నివసించెను. ప్రస్తుతం చంద్రగిరి కోట పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నది. ఇక్కడికి నిత్యం కొన్ని వేలమంది యాత్రికులు చంద్రగిరి కోటను చూడటానికి వస్తుంటారు. ఇక్కడ అద్భుతమైన మ్యూజియం ఏర్పాటు చేయడమైనది. మ్యూజియంలో చూసుకున్నట్లయితే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి వాడిన వస్తువులు, ఖడ్గాలు సామ్రాజ్యంలోని సైన్యం వాడుతున్నటువంటి ఆయుధాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. అంతేకాకుండా అప్పట్లో చలామణిలో ఉన్నటువంటి బంగారు వెండి రాగి నాణ్యాలు కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు. ఇప్పటికీ శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్య చరిత్రను వివరించే విధంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు, కోటకు ఎదురుగానున్న ఖాళీ ప్రాకారం నందు సందర్శకులు వీక్షించి వీనులు విందు చేసే విధంగా చరిత చెప్పబడుతుంది.

చంద్రగిరి గ్రామ దేవత శక్తి స్వరూపిణిగా పిలవబడే శ్రీ మూలస్థాన ఎల్లమ్మ చంద్రగిరి నగరంలో వెలసి ఉన్నది. చంద్రగిరి కి సంబంధించినటువంటి స్థానికులే కాకుండా తిరుపతి, బాకరాపేట, నరసింగాపురం, రంగంపేట, ఐతేపల్లి, చిత్తూరు, ప్రాంతాల నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారు కొలువు కొలువుదీరిన నగరం చంద్రగిరిలో నిత్యం అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు. పురాతన కాలం నుంచి కూడా అమ్మవారు ఇక్కడ వెలసి ఉన్నారు. అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాలతో నిత్యం అమ్మ సన్నిధిలో పొంగళ్ళు పెట్టి, పొట్టేలను కొట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం అమ్మ తమ గ్రామాన్ని తమ కుటుంబాలను చల్లగా చూస్తున్నటువంటి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారి సన్నిధిలో పుణ్యస్నానాలు ఆచరించి చదువురాని వారికి కానీ పెళ్లిళ్లు కానీ యువతీ యువకులు కానీ అదేవిధంగా పెళ్లి పిల్లలు లేని వారికి కుటుంబ కలహాలు లాంటి అనేక సమస్యలతో బాధపడుతున్న వారు అమ్మవారి సన్నిధికి చేరుకొని అమ్మకు మొక్కుకొని వారు మొక్కులు తీరిన తరువాత అమ్మకు జాతరలు కూడా చేస్తారు. దేవీ నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులు పాటు అమ్మకు నిత్య పూజలతో పాటు విశేష అలంకరణలు జరిపి నగరంలో అమ్మకు ఊరేగింపులు చేస్తారు. ప్రత్యేకించి శుక్రవారం ఉదయ పూర్వం మూలస్థానమ్మకు ప్రత్యేక అలంకరణ చేసి రాహుకాల సమయంలో అమ్మకు అభిషేకించినటువంటి జలాన్ని వచ్చినటువంటి భక్తులకు మొహం మీద చల్లుతూ అమ్మవారి కృపకు పాత్రులు అయ్యే విధంగా అక్కడ పూజారులు వ్యవహరిస్తారు. నేటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మూలస్థాన అమ్మ వారి దేవాలయాన్ని పూన ప్రతిష్టించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

చంద్రగిరి నియోజకవర్గం ఉత్తరం వైపు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ధర్మపత్ని శ్రీ పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. తిరుచానూరు గ్రామ దేవతగా శక్తి స్వరూపిణిగా పిలిస్తే పలికే కొంగుబంగారంగా విరాజల్లుతున్నారు శ్రీ పద్మావతి అమ్మవారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఆలయం లోని అమ్మవారు వేద పండితుల వేద మంత్రోచ్ఛారణ నడుమ నిత్య పూజలు అందుకుంటూ తన దగ్గరికి వస్తున్నటువంటి భర్తకోటికి సకల శుభాలు కలిగిస్తున్నారు. నిత్యం 50 వేల మందికి పైగా భక్తులు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా చంద్రగిరి నగరం నుంచి పది కిలోమీటర్ల దూరంలో పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. పద్మసరోవరంలో అమ్మవారు జన్మించారు కాబట్టి పద్మావతి అమ్మవారిగా తిరుచానూరులో కొలువై ఉన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని ఏర్పార్టను చేసింది. అమ్మ ఆలయంలో నిత్య అన్నదానం కొనసాగుతూనే ఉంటుంది. రోజుకు 20 వేల నుంచి 30 వేల మంది భక్తులు ఇక్కడ అమ్మవారి అన్నదాన సత్రంలో అన్న ప్రసాదాలను స్వీకరిస్తారు. ప్రత్యేకించి బ్రహ్మోత్సవాల సమయంలో అమ్మవారు వివిధ రకాలైన వాహనాలు అధిరోహించి తిరుచానూరు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని ఆశీర్వదిస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా నిత్యం భక్తకోటి అమ్మవారి దర్శనానికై వస్తుంటుంది. నిత్యం గోవింద నామ స్మరణలతో అమ్మవారి ఆలయం కనువిందుగా ఉంటుంది.

చంద్రగిరి పట్నానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో తలకోన జలపాతం ఉన్నది. కొన్ని వందల అడుగుల పై నుంచి జలజల జాలు వారుతున్న జలపాతం ఇక్కడ చూపరులను ఆకట్టుకుంటుంది. ఓవైపు ప్రకృతి రమణీయత మరోవైపు పక్షుల కిలకిల రావాలు, వన్య మృగాల ఘీంకారాలు గలగల పారేటి సెలయేరులు మనసును ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఆ ప్రకృతి ఒడిలో సేద తీరే విధంగా తలకోన సహజ సిద్ధంగా నిర్మితమై ఉంటుంది. తలకోనలో పరమశివుడు సిద్దేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామికి ప్రత్యేక అలంకరణతో పాటు విశేష పూజలు జరుగుతాయి. తలకోనకు వచ్చేటువంటి సందర్శకులు ప్రకృతి అందాలను ఆస్వాదించడమే కాకుండా సిద్దేశ్వర స్వామి ఆశీస్సులు కూడా పొందుతారు.

1952 వ సంవత్సరంలో చంద్రగిరి నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆది కేశవులు నాయుడు నిలబడి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు తరువాత చంద్రగిరి నియోజకవర్గ కాస్త తవణంపల్లి నియోజకవర్గంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే 1952 తర్వాత చంద్రగిరి నియోజకవర్గమే లేదు. అటు తరువాత 1978లో చంద్రగిరి నియోజకవర్గంగా తిరిగి రూపాంతరం చెందింది. 1955 నుంచి 1962 వరకు పాటూరి రాజగోపాల్ నాయుడు( మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమారి ఫాదర్) స్వతంత్ర పార్టీ అదేవిధంగా కృషి కార్ లోక్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆచార్య ఎన్జీరంగా స్థాపించినటువంటి పార్టీ కృషికార్ లోకల్ పార్టీ. ఆచార్య రంగా రైతు నాయకులు ఆయన ఏ పార్టీ పెడితే ఆ పార్టీలోకి రాజగోపాల్ నాయుడు వెళ్లి అక్కడ గెలుపొందేవాడు. అయితే 1978వ సంవత్సరంలో మరోసారి నియోజకవర్గ పురుడు పోసుకున్న చంద్రగిరిలో కాంగ్రెస్ “ఐ” ఇందిరా గాంధీ పార్టీ తరఫున పోటీ చేసి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు తరువాత 1983లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మేడసాని వెంకట్రామానాయుడు గెలుపొందగా, కాంగ్రెస్ “ఐ” తరుపున పోటీ చేసిన చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. అనంతరం 1985లో ఎన్ ఆర్ జయదేవ నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. అటు తర్వాత జరిగిన 1989 ఎన్నికల సంగ్రామంలో గల్లా అరుణకుమారి కాంగ్రెస్ తరపున పోటీ చేసి చంద్రగిరి పీఠాన్ని దక్కించుకున్నారు. అటు తరువాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నారా రామ్మూర్తి నాయుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు విజయం సాధించాడు 

    తెలుగుదేశం పార్టీ తరఫున. తరువాత కాలానుగుణంగా అనేక మార్పులు చేర్పులు జరిగాయి 1999లో తిరిగి కాంగ్రెస్ తరపున అరుణకుమారి విజయం సాధించారు అటు తర్వాత 2004, 2009 ఏక చక్రాధిపత్యంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని గల్లా అరుణ శాసించింది. అటు తరువాత 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి నిరాశను చవిచూసింది గల్లా అరుణకుమారి. అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రగిరి నియోజకవర్గం పగ్గాలు చేపట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు 2024 ఎన్నికల్లో తన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చంద్రగిరి టికెట్ ఇవ్వాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధిష్టానం విన్నవించుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సరేనంది. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు లక్షల మంది జనాభా ఉన్నారు. ఇందులో మూడు లక్షల మంది ఓటర్లు కాగా సుమారు లక్ష మంది నాన్ ఓటర్స్ గా మిగిలారు.

Latest Articles

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

కూటమితోనే అభివృద్ధి, సంక్షేమం అభివృద్ది, సంక్షేమం కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు యార్లగడ్డ వెంకట్రావు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం రామవరప్పాడులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్‌ కల సాకారమవ్వాల న్న,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్