మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు 300 సెల్‌టవర్లను సీఎం జగన్ ప్రారంభించారు. ఎయిర్‌టెల్ ఆధ్వర్యంలో 136 , జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44 ఏర్పాటు చేయగా… ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో ఒక టవర్ ఏర్పాటు చేశారు. ఈ టవర్ల ఏర్పాటు ద్వారా 944 ఆవాసాలకు, 2 లక్షల మంది ప్రజలకు ఉపయోగం ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. గత జూన్‌లో 100 టవర్ల ఏర్పాటు చేయగా… మొత్తంగా ఇప్పటివరకూ 400 టవర్ల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు 400 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. టవర్లకు అవసరమైన భూములను వెంటనే అప్పగించామన్నారు. 5 వేల 549 గ్రామాలకు పూర్తి మొబైల్ టెలికాం సేవలు అందుతాయని సీఎం తెలిపారు.


