23.7 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

కృష్ణ, గోదావరి ప్రాజెక్ట్‌లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా ?

         కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను తమపై వేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం జరిగిందని స్పష్టత నిచ్చారు ముఖ్యమంత్రి. అసలు… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టం కంటే… కేసీఆర్ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువంటూ తీవ్రస్థాయిలో విమ ర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి.

       కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే వ్యవహారంలో గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారం పై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయా లని విభజన చట్టంలోనే ఉందన్నారు ముఖ్యమంత్రి. కేంద్రం తనను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని రాసింద ని కేసీఆర్ గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు సీఎం రేవంత్. కృష్ణా నదిలో 811 టీఎంసీల నీటి ని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలన్న దానిపై కేంద్రం కమిటీ వేసిందన్న ముఖ్యమంత్రి..ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించిన విషయాన్ని వెల్లడించారు. దానిపై నాటి సీఎం కేసీఆర్, ఇతర అధికారులు సంత కం సైతం చేశారని చెప్పుకొచ్చారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లుగా చెబుతూ 2022లోనే సంతకా లు చేశారన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు ప్రాజెక్టులపై కేసీఆర్ పార్లమెంటులో ప్రశ్నించలేదని.. ఇప్పుడు మాత్రం కృష్ణాలో 50 శాతం వాటా అడుగుతున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి. వైఎస్ హయాం లో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారన్న సీఎం…దీనికి కేసీఆర్, హరీష్‌రావు సహకరించారన్నారు. దీని కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు ముఖ్యమంత్రి.

          ఇక, వైఎస్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీలు తరలించేందుకు సీఎం జగన్ ప్రణాళిక వేశారని.. అందుకు కేసీఆర్ అనుమ తిచ్చారని తెలిపారు రేవంత్ రెడ్డి. గతంలో కృష్ణానది ప్రాజెక్టులపై ఆధిపత్యం తెలంగాణ చేతిలో ఉండేదని.. పదవులు, కమిషన్లకు లొంగి బీఆర్ఎస్ ప్రభుత్వం జలదోపిడీకి సహకరించిందని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ నిర్లక్ఖ్యం జరిగిందని విమర్శించిన సీఎం… ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోకుండా పదేళ్లు ఏం చేశారని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభ ఉమ్మడి సమావేశాలు నిర్వహించి రెండు రోజుల పాటు చర్చి ద్దామని తెలిపారాయన. ఇక, ముఖ్యమంత్రి కామెంట్లకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. కాంగ్రెస్‌ పార్టీ తమపై పసలేని ఆరోపణలు చేస్తోందన్నారు. విభజన చట్టం చేసినప్పుడు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. అసెంబ్లీలోనే ఈ అంశంపై దిమ్మతిరిగేలా సమాధానం చెబుతామ న్నారు. మొత్తంగా ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నా రు. అసెంబ్లీలోనే తేల్చుకుందామంటూ సై అంటే సై అన్నారు. మరి.. ఇప్పుడే వీరి మాటల తూటాలు ఇలా ఉంటే.. శాసనసభలో దీనిపై చర్చ జరగినప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్న ఉత్కంఠ ఇప్పుడే మొదలైంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్