కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి SBI బ్రాంచ్‌లో చోరీ జరిగింది. మేనేజర్ తమ సిబ్బందితో బ్యాంక్ తెరిచే క్రమంలో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ సతీష్ కుమార్, పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి పరిశీలించారు. ఉత్తరకంచి SBI బ్రాంచ్‌లో చోరీ జరిగిందని… కొందరు దుండగులు వెనుక భాగం నుండి లోపలికి వెళ్లి చోరీకి పాల్పడ్డారని జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 75లక్షలు చోరీ జరిగిందన్నారు. త్వరలోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.


