30.2 C
Hyderabad
Friday, March 1, 2024
spot_img

ఇష్టారాజ్యంగా మారిన వైన్ షాప్ ల నిర్వహణ

       వైన్ షాప్ పర్మిట్ రూంలు బార్ అండ్ రెస్టారెంట్లను తలపిస్తున్నాయి. జిల్లాలో 93 మద్యం దుకాణాలున్నాయి. నిబంధనల ప్రకారం పర్మిట్ రూంలో మద్యం తాగడానికి గ్లాసులు. వాటర్, ప్యాకింగ్ చేసిన తినుబండరాలు మాత్రమే విక్రయించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా అన్ని పర్మిట్ రూంలలో మటన్, గుడ్లు , చికెన్, చేపలు బోటి ఆహార పదార్థాలు విక్రయిస్తూ, వెయిటర్లను ఏర్పాటు చేసి బార్లను తలపించేలా వ్యాపారం చేస్తున్నారు. మద్యం షాపుల యజమానులు నిబంధనలు గాలికొదిలేస్తున్నారు.

        సిద్ధిపేట జిల్లా లో వైన్ షాప్ లు బార్లుగా సిట్టింగ్ లే రెస్టారెంట్లుగా నడిపిస్తున్నారు. అధికారుల అండలతో రోడ్లు పైన కాలేజీల ముందు వైన్ షాప్ లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిబంధనల పేరుతో యువతను చెడు మార్గానికి , మహిళల ఇబ్బందులకు, రోడ్డు ప్రమాదాలకు వారధిగా నిలుస్తున్నా ఘటన జిల్లాలలో నెలకొంది.ఒక్కో మద్యం షాప్‌కు అనుబంధంగా వంద చదరపు మీటర్ల విస్తీర్ణంతో పర్మిట్ రూంను ఏర్పాటు చేసుకోవాలి. కానీ చాలా మద్యం షాపులు ఈ నిబంధనలు పాటించడం లేదు. వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేశారు. పర్మిట్ రూంలో ఒక్క టేబుల్ మాత్రమే ఉండాలి. కానీ 15 నుంచి 20 టేబుళ్లు వేస్తున్నారు. వైన్ షాప్ యజమానులు పర్మిట్ రూంలు మరొకరికి లీజుకు ఇస్తున్నారు. మరికొన్ని షాప్లలో ఓపెన్ ఎయిర్లలో సైతం సిట్టింగు ఏర్పాటు చేశారు. వైన్ షాప్లలో… బార్లలో ఏర్పాటు చేసినట్లు అర్డర్ తీసుకునేందుకు వెయిటర్లను సైతం ఏర్పాటు చేశారు. మరికొన్ని వైన్ షాప్లలో బయటి నుంచితినుబండరాలు తీసుకురావద్దని బోర్డులను సైతం ఏర్పాటుచేశారు. బయట నుంచి తెచ్చుకునే తినుబండారాలను లోపలికి తీసుకరానివ్వడం లేదు. పర్మిట్ రూమ్లలో రెడీ టు ఈట్ ఫుడ్ మాత్రమే అనుమతించాలి. కానీ రెస్టారెంట్ల మాదిరిగా ఏర్పాటు చేసి చికెన్, మటన్, బోటి, తలకాయ ఇలా అన్ని రకాల మాంసాహారాన్ని అందిస్తు న్నారు. మున్సిపాలిటీలు, ఫుడ్ ఇన్స్పెక్టర్ల నుంచి లైసెన్స్‌లు పొందాలి. పర్మిట్ రూముల్లో విక్రయాలు జరిపే వారికి ఎలాంటి లైసెన్స్ లు ఉండడం లేదు.

       చిన్నకోడూరు మండల కేంద్రంలో వైన్ షాప్ నివాస గృహాల మధ్య నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూల్ కాలేజీలకు వెళ్లే దారిలో ఏర్పాటు చేయొద్దని గ్రామ పంచాయతీ పాలక వర్గం వినతి పత్రాన్ని అందించారు. అయినప్ప టికీ అధికారులు మామూళ్లకు అలవాటు పడి అక్కడే ఏర్పాటు చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామం వద్ద నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ నుండి రామగుండం రాజీవ్ రహదారి ప్రధాన రహదారిపై మద్య షాప్ లను ఏర్పాటు చేశారు. మామూళ్ల మత్తులో పడ్డ అధికారులు ప్రధాన రహదారి నుండి 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయలనే నిబంధన తుంగలో తొక్కారు. ఈ వైన్ షాప్ ముందు గత నెల రోజుల క్రితం షాప్ నుండి మద్యం కొనుగోలు చేసి, వస్తున్న వ్యక్తి వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన కూడా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తూన్నారు. అక్కడి నుండి షాప్ ను మార్చాలని బాధితులు డిమాండ్ చేసినా…. అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది.

       మామూళ్ళ మత్తులో ఎక్సైజ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఇంత జరుగుతున్నా సంబం ధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలు తావిస్తోంది. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోని మద్యం వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైన్ షాప్ ల షిఫ్టింగ్ కోసం మద్యం వ్యాపారులు దరఖాస్తు చేశారు. దుబ్బాక మండలం హబ్సిపూర్ నుంచి తిమ్మాపూర్ కు , సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ నుంచి ఇర్కోడ్, అక్కన్నపేట నుంచి గోవర్ధనగిరి, చేర్యాల పట్టణం నుంచి గురజా కుంటకు, మరొక షాప్ నాగపూర్ కి షిఫ్టింగ్ కోసం దరఖాస్తు చేశారు. నిబంధనల ప్రకారం పట్టణానికి చెందిన షాప్ ల పట్టణ పరిధిలోనే మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇతర ప్రాంతాలకు సైతం దరఖాస్తు చేశారు. ఓ అధికారి ప్రోత్సాహంతో దరఖాస్తు చేసినట్లు తెలిసింది.

            పర్మిట్ రూంలు వంద చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్న వాటిని పరిశీలించి చర్యలు తీసుకుం టాం. స్థల మార్పు కోసం ఐదు దరఖాస్తులు వచ్చాయి. వాటిని కమిషనర్ కు పంపించాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు ముందుకెళతాం. అంటున్నారు ఎక్సైస్ శాఖ అధికారి శ్రీనివాసమూర్తి. గత ప్రభుత్వం నిధులకు కక్కుర్తి పడి ఎక్కడపడితే అక్కడ వైన్ షాపులను ఏర్పాటుకు గ్రీస్ సిగ్నల్ ఇచ్చింది. రోడ్డు ప్రమాదా లకు నిలయంగా మారేలా నిబంధనలను తయారుచేసి వైన్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు జీవో ఇచ్చింది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా నిబంధనలు మార్చి కాలేజీలకు ఆలయాలకు, గృహ సముదాయా లకు దూరంగా మద్యం షాపులు ఉండేలా చూడాలి.అలాగే రోడ్డుపైన వైన్ షాపులు ఏర్పాటు చేయకుండా జీవో జారీ చేయాలని కోరారు ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు వివేక్ .

     జిల్లాలో దేవాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు హైవే ప్రధాన రహదారులు అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలుగు తుందని తెలిసిన కూడా మద్యం షాపులు షిప్ట్ చేయడం లేదు. మహిళలు రోడ్డుపైన ఒంటరిగా నడవాలంటే, ఇబ్బంది గా ఉండే విధంగా వైన్ షాపులను ఏర్పాటు చేశారు. జిల్లాలో అధికారు లు మామూళ్లకు అలవాటు పడి సామాన్యప్రలజ ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇకనైనా రోడ్ల పైన, ఆల యాలు, విద్యాలయాలకు సమీపలో ఉన్న వైన్ షాపులను తొలగించాలని సీఐటీయు మహిళా అధ్యక్షురాలుకోరుతున్నారు. జిల్లాలో ప్రధాణ పట్టణాలలోని విద్యాలయాల ముందు ప్రధాన రహదారిపైన వైన్ షాపులను ఏర్పాటు చేయడం శోచనీయం. యువత చెడు మార్గం పట్టేలా వైన్ షాపులు ఏర్పాటు చేశారని, చిన్నకోడూరు గ్రామ పంచాయతీ పాలక వర్గం గృహ సము దాయంలో ప్రధాన రహదారి పైన వైన్ షాపును ఏర్పాటు చేయొద్దని వినతి పత్రం ఇచ్చారు. మామూళ్ల మత్తుతో పడ్డ అధికా రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం కాలేజీకి స్కూళ్లకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉన్న షాపుని తొలగించి వేరే చోటకు మార్చాలంటున్నారు విద్యార్థి సంఘ నాయకులు.

Latest Articles

పేర్ని నానికి కౌంటర్ ఇచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు వేదికగా..మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు కొత్తపల్లి సుబ్బారాయుడు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ, జనసేన సభ నిర్వహిస్తే నాని ఎందుకు ఆందోళన చేందుతున్నారని ఫైర్ అయ్యారు. ఆందోళన తగ్గాలంటే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్