28.2 C
Hyderabad
Sunday, March 3, 2024
spot_img

అయోధ్య రామయ్యను దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

       అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్స వం అంబరాన్నంటింది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తమ అంతరంగంలో ఆత్మారాముడిని కొలుచుకున్నారు. ఎన్నో శతాబ్దాల హిందువుల కల సాకారం అయింది. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామలల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. 12.29 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పాల్గొన్నారు.

      రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనతో అయోధ్య నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఎటు చూసినా రామ నామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్‌ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పా టు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ మహత్కార్యా నికి దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు.

      అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతోంది. యావత్ భారతావనితోపాటు ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులు పండగను జరుపుకుంటున్నారు. భారత దేశంమంతా రామమయం అయిపోయింది. ప్రాణ ప్రతిష్ఠ సమ యంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం కురిపించారు. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామయ్య కొలువుదీరాడు. భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరుగుతోంది.

   అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. జై శ్రీరామ్‌ నినాదాలతో అక్కడి వీధులన్నీ మార్మోగుతున్నాయి. ఈ మహోత్సవానికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు, స్వామీజీలు వేలాదిగా తరలివచ్చారు. అయోధ్యలో ఎటుచూసినా రామనామాన్ని జపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు రామ మందిరం వద్దకు సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు వేల సంఖ్య పాల్గొన్నారు.

      రామ మందిర ప్రారంభోత్సవానికి వేల సంఖ్యలో అతిథులు వచ్చారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖుల హాజరైయ్యా రు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు వ్యాపార వేత్త అనిల్ అంబానీ తదితరులు పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిథ్య నాథ్, టీడీపీ అధినేత చంద్రబాబు, సూపర్ స్టార్ రజనీకాంత్‌, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమితాబ్‌బచ్చన్‌, సచిన్‌ టెండూల్కర్‌, అనిల్‌కుంబ్లే, బాలీవుడు స్టార్ నటులు‌, రామ్‌దేవ్‌ బాబా తదితరులు వచ్చారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అధినేత ముకేశ్‌ అంబానీ దంపతులు, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ కూడా రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్యలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలు అల్లరించాయి. ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాయణ ఘట్టాలను వివరిస్తూ పలువురు గాయకులు గీతాలను ఆలపించారు.

Latest Articles

అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు

      వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం పెట్టిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్