22.7 C
Hyderabad
Friday, March 1, 2024
spot_img

అధికార పక్షం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిందా?

          సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, మౌలికంగా మనదేశంలోని అత్యున్నత నేర విచా రణ సంస్థలు. ఎవరైనా సరే పెద్ద పెద్ద ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ విచారణ జరుపుతుంటాయి. 2014కు ముందు సీబీఐ, ఈడీలకు సంబంధించిన వార్తలు మీడియాలో పెద్దగా కనిపించేవి కాదు. అయితే 2014 తరువాత పరిస్థితి మారిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిం చి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. దీంతో సీబీఐ, ఈడీలకు సంబంధించిన వార్తలు తరచు గా మీడియాలో కనిపించడం మొదలైంది. అంతేకాదు కేంద్ర దర్యాప్తు సంస్థలు నమోదు చేస్తున్న కేసులు హాట్‌టాపిక్‌ లుగా మారుతున్నాయి.

       ఒక్క మాటలో చెప్పాలంటే 2014 తరువాత దేశ రాజకీయాల స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీయేతర పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులపై కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కేసులంటే అలా ఇలా కాదు చాలా పెద్ద పెద్ద కేసులు. ఆరోపణలకు గురైన వారిపై విచారణలు ప్రారంభమయ్యాయి. అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఎన్‌ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇన్‌కంటాక్స్, నార్కోటిక్ కంట్రోల్‌ బోర్డు వంటివి రంగంలోకి దిగడం మొదలైంది. ఆయా నాయకుల నివాసాల్లో, వారికి సంబంధించిన వ్యాపార సంస్థల్లో ఎడాపెడా తనిఖీలు, సోదా లు చేపట్టడం ప్రారంభమైంది. ఆరోపణలకు గురైన వ్యక్తికి సంబంధించి ఏ చిన్నపాటి ఆధారం దొరికినా వారిని జైలుకు పంపడానికి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు వెనకాడడం లేదు. ఆర్థిక నేరాలకు, వ్యాపారాల్లో అక్రమాలకు ఎవరు పాల్పడి నా విచారించాల్సిందే. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయమే లేదు. ఆదాయపు పన్ను సోదాలు, తనిఖీలు, ఈడీ దాడు లు…ఇవన్నీ అక్రమార్కుల గుట్టు విప్పడానికే అయితే ఎవరికీ అభ్యంతరం కూడా ఉండదు. ఉండకూడదు కూడా. అయితే దర్యాప్తు సంస్థల నిష్పాక్షితపైనే అనుమానాలు రావడం ఆందోళన కలిగిస్తోంది.

      బీజేపీయేతర రాజకీయ ప్రముఖులపై అలా ఆరోపణలు వచ్చాయో లేదో ఇలా వారికి సంబంధించిన కార్పొరేట్‌ ఆఫీసులపై ఇన్‌కంటాక్స్ దాడులు మొదలవుతాయి. ప్రతిపక్షాల నేతల నివాసాల్లో ఈడీ దాడులు ప్రారంభమవుతాయి. బీజేపీయేతర రాజకీయ పార్టీల నేతలపై దర్యాప్తు సంస్థలు ఇలా ఉన్నట్టుండి రెచ్చిపోవడం వెనక రాజకీయ కోణం ఉందన్న ఆరోపణలు కొంతకాలంగా వస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు సర్కార్ చేతిలో కీలు బొమ్మలుగా వ్యవహరి స్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా దర్యాప్తు సంస్థల పనితీరుపై విమర్శలు రావడానికి కారణాలు లేకపోలేదు. అవినీతి, అక్రమాలకు ఎవరు పాల్పడినా దర్యాప్తు జరపాల్సిందే. ఆరోపణల్లో నిగ్గు తేల్చాల్సిందే. అయితే నరేంద్ర మోడీ ప్రభు త్వం వచ్చాక భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులెవరిపైనా సీబీఐ,ఈడీ,ఐటీ వంటి సంస్థలు కేసులు నమోదు చేయలేదు. ఎక్కడైనా చేసినా ఒకటి అరానే. చెప్పుకోదగ్గ స్థాయిలో కేసులు ఎక్కడా లేవు.

        బీజేపీనేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసినా, అవి ప్రజలకు చూపించుకోవడానికే అన్నట్లుగా ఉంటా యి. అంతేకాదు…కమలనాథులపై కేసులుంటే వాటిపై దర్యాప్తు సంస్థలు తూతూ మంత్రంగా దర్యాప్తు చేస్తాయ న్న ఆరోపణలు కూడా మిన్నంటుతున్నాయి. కాగా కమలం పార్టీ నాయకుల దరిదాపులకు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ లు వెళ్లడం లేదని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అదే తాము కేంద్ర ప్రభుత్వ విధానాలను సైద్ధాంతికంగా విమర్శిస్తే, మరునాడు నుంచి తమను దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని మండిపడుతున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. అంతేకాదు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాయని దర్యాప్తు సంస్థలపై మండిపడుతున్నారు. అంతేకా దు…రాజకీయ ప్రత్యర్థులపై ఇలా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడమే నరేంద్ర మోడీ మార్క్‌ రాజకీయమని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.

Latest Articles

పేర్ని నానికి కౌంటర్ ఇచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు వేదికగా..మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు కొత్తపల్లి సుబ్బారాయుడు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ, జనసేన సభ నిర్వహిస్తే నాని ఎందుకు ఆందోళన చేందుతున్నారని ఫైర్ అయ్యారు. ఆందోళన తగ్గాలంటే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్