26.6 C
Hyderabad
Monday, March 2, 2026
spot_img

అత్యుత్తమ ప్రధానిగా నరేంద్ర మోడీ

      ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరికొన్ని నెలల్లో పేళ్లు పూర్తి చేసుకోబో తోంది. ఈ పదేళ్ల కాలంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసు కుంది నరేంద్ర మోడీ సర్కార్‌. 2014లో కమలం పార్టీ అనూహ్య విజయం సాధించడంతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది. ఇక అప్పటినుంచి నరేంద్రుడి ప్రభుత్వం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక్కొటొక్కటిగా ప్రజలకు, దేశానికి మేలు చేసే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.

       అది 2019..ఆగస్టు ఐదో తేదీన నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను నరేంద్ర మోడీ సర్కార్ రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రా న్ని విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. ఇందులో ఒకటి జమ్మూ-కాశ్మీర్ కాగా రెండోది లడఖ్. ఈనేపథ్యంలో కాశ్మీర్‌ లోయలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది. దీంతో గతంలో తుపాకుల చప్పుళ్లు వినిపించిన కాశ్మీర్‌ లోయ రూపురేఖలు ప్రస్తుతం మారిపోయాయి. కాశ్మీర్‌లోయలో ప్రస్తుతం ఎటు చూసినా పర్యాటకులు కనిపిస్తు న్నారు. నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఫలితంగా కాశ్మీర్‌లో మళ్లీ పర్యాటకుల సందడి నెలకొంది. ఆర్థికంగా బలహీనమైన అగ్రవర్ణాల ప్రజల మేలు కోసం ఈడబ్ల్యుఎస్ కోటాను ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ సర్కార్. 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యుఎస్ కోటా ఫలితంగా విద్య, ఉద్యోగ రంగాలలో అగ్రవర్ణాల పేద లకు రిజర్వేషన్ సౌకర్యం లభిస్తుంది. అయితే ఈడబ్ల్యుఎస్ కోటా అర్హత పొందడానికి ఒక వ్యక్తి కుటుంబ ఆదాయం ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయలు మించకూడదని షరతు విధించింది కేంద్ర ప్రభుత్వం.

     ముస్లిం మహిళల కన్నీళ్లకు కారణమైన ట్రిపుల్ తలాక్‌ కు సంబంధించి నరేంద్ర మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసు కుంది. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే బిల్లు 2019 జూలైలో పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింప చేసింది కేంద్రం. దీంతో ట్రిపుల్ తలాక్ పేరుతో తక్షణ విడాకులు తీసుకునే ముస్లిం పురుషులకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించడం అనేది ఎప్పటినుంచో ఉన్న డిమాండ్. ఎట్టకేలకు మహిళల కు సంబంధించిన ఈ బిల్లును సాకారం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆధునిక భారత రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓ చారిత్రక ఘట్టం. దాదాపు 27 ఏళ్ల మహిళల సుదీర్ఘ కలను నరేంద్రుడి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాకారం చేసింది.

      వస్తు సేవల పన్ను విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదే.. జీఎస్టీ. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం తీసుకున్న అత్యంత ముఖ్యమైన పన్ను సవరణే.. జీఎస్టీ. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో కేంద్రం, రాష్ట్ర పన్నులు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. అంతేకాదు లక్షలాది మంది వ్యాపారులను పన్ను పరిధిలోకి తెచ్చింది సర్కార్. దీంతో ప్రభుత్వ ఆదాయం కూడా భారీగా పెరిగింది.కిందటేడాది మే 28న పార్లమెంటు కొత్త భవనం ప్రారంభమైంది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీయే కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు.కొత్త భవనాన్ని పార్ల మెంట్ ఆఫ్ ఇండి యాగా ప్రకటించారు. అమృతకాలంలో భారతదేశ అత్యున్నత చట్టసభ సమున్నత లక్ష్యాలతో ముందుకె ళుతున్నట్లు నరేంద్ర మోడీ చెప్పారు. పార్లమెంటు కొత్త భవనం నిర్మాణానికి పెద్ద కసరత్తు జరిగింది. 2020 డిసెంబర్ 10న కొత్త భవనానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.కొత్త భవనం నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. అంతిమంగా పార్లమెంటు కొత్త భవనం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. పార్లమెంటు కొత్త భవనం నూటికి నూరుశాతం ప్రధాని నరేంద్ర మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఆధునిక వసతులతో , అధునాతన వసతులతో అంద రినీ ఆకట్టుకునేలా కొత్త భవనాన్ని నిర్మించింది కేంద్ర ప్రభుత్వం.

     ‘స్వచ్ఛ భారత్ అభియాన్‌’.. ఇది ప్రధాని నరేంద్ర మోడీ డ్రీమ్ మిషన్. దేశంలో పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడానికి 2014లో గాంధీ జయంతి రోజున ప్రధాని మోడీ ‘స్వచ్ఛ భారత్ అభియాన్‌’ను ప్రారంభించారు. ఈ మిషన్‌లో భాగంగా ఐదేళ్లలో 100 మిలియన్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా బహిరంగ మలవిసర్జన రహిత గ్రామీణ భారతదే శానికి రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు అయోధ్య రామమందిర అంశం, నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక ఘట్టంగా మారింది. ఐదు వందల ఏళ్లనాటి హిందువుల కలను సాకారం చేసిన హీరోగా ప్రధాని నరేంద్ర మోడీకి సామాన్య ప్రజల్లో ఇమేజ్ వచ్చింది. ప్రధాని కుర్చీలో నరేంద్ర మోడీ కాకుండా మరో నాయకుడు ఉంటే అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉండేదన్న అభిప్రాయం సమాజంలో నెలకొంది. పార్టీల కతీతంగా ప్రజలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర సేవకుడిగా సంకల్పం తీసుకున్న నరేంద్ర మోడీ, ప్రధాని అయ్యాక సంకల్పాన్ని నెరవేర్చుకున్నారన్న అభిప్రాయం సామాన్య జనంలో వినిపిస్తోంది.

     జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీయే అత్యంత జనాకర్షణగల నాయకుడు. రైల్వే స్టేషన్‌లో చాయ్ అమ్మడం ద్వారా జీవితం మొదలెట్టిన నరేంద్ర మోడీ అంతిమంగా దేశ ప్రధాని అయ్యారు. ఈ మధ్యలో నరేం ద్రుడి జీవితం అనేక ఆటుపోట్లకు గురయ్యింది. విశ్వహిందూ పరిషత్‌ నుంచి 1987లో భారతీయ జనతా పార్టీలోకి ప్రవేశించారు నరేంద్ర మోడీ. ఆ తరువాత బీజేపీలో అంచె లంచెలుగా ఎదిగారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు అలాగే 1992లో మరళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-కాశ్మీర్ రథయాత్రకు నరేంద్ర మోడీ ఇన్‌చార్జీగా పనిచేశారు. మెల్లమెల్లగా గుజరాత్ బీజేపీలో ఒక ప్రముఖ నాయకుడిగా ఎదిగారు. గుజరాత్ ముఖ్య మంత్రిగా కూడా నరేంద్ర మోడీ అనేక విజయాలు నమోదు చేశారు. నరేంద్ర మోడీ ప్రవేశించిన గుజరాత్ మోడల్, ఒక అభివృద్ది నమూనాగా దేశమంతా పాపులరైంది. ఆ తరువాత జాతీయ రాజకీయాల్లో అనేక పరిణామాలు సంభవిం చాయి. ఈ నేపథ్యంలో 2014 మే 26న దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత 2019 లోక్‌ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయదుందుభి మోగించింది. నరేంద్ర మోడీ రెండోసారి ప్రధాని అయ్యారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పదేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. అయినప్ప టికీ అవినీతి మరక అంటని రాజకీయ జీవితం ఆయనది. సబ్‌ కా సాథ్‌…సబ్‌ కా వికాస్ అంటూ.. .సమాజంలోని అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటూ సాగిపోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్