రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం పేరిట ఉక్కుపాదం మోపడం దారుణమని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. అంగన్వాడీలపై తీవ్ర చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంగన్వాడీలు విధులో చేరేందుకు డెడ్ లైన్ విధించింది. నేటితో డెడ్‌లైన్ పూర్తవడంతో… సాయంత్రం లోగా విధుల్లో చేరాలంటూ అధికారులు అంగన్వాడీల సెల్‌ఫోన్లకు సందేశం పంపించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు ఏపీలో సమ్మె చేస్తున్నారు. ఎస్మాతో సమ్మె చేయడానికి వీల్లేందంటూ ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పటికి… అంగన్‌వాడీ నిరసనలు కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నంబర్ 2ను జారీ చేసి.. ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలకు ఆస్కారం లేదంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఎస్మా చట్టంపై అంగన్‌వాడీ కార్యకర్తలు ఏమాత్రం వెనక్కితగ్గలేదంటూ… 27రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరిస్తున్నారు.