25.2 C
Hyderabad
Friday, November 22, 2024
spot_img

భక్త దర్శనానికి అయోధ్య రామయ్య సిద్ధం

ఏడు మోక్ష పురాల్లో ఒకటిగా అలరారుతున్న పుణ్యతీర్థం అయోధ్య రామమందిరం. పూర్వం రామమందిరం ఉన్న స్థానంలో నూతన ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన ఆలయ ట్రస్ట్ శరవేగంగా నిర్మాణ పనులను పూర్తి చేసింది. వందల ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహిమాన్వితమైన అయోధ్య రామ జన్మభూమి, భక్తుల సందర్శనార్ధం సర్వ హంగులతో సిద్ధమవుతోంది. భారతీయ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచే సాకేత రాముడి మందిరాన్ని, భక్తులు దర్శించే శుభ ఘడియలు రానే వచ్చేశాయి.

అయోధ్యలో అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. ఈనెల 22న జరగనున్న రామమందిర నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆలయ పైభాగాన్ని కూడా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు అనుగుణంగా పరిసర ప్రాంతాలను కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. త్రేతాయుగంలో అయోధ్య నగరం ఎలా ఉండేదో ప్రస్తుత యుగంలో అలాంటి అయోధ్య నగర నిర్మాణం కోసం కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది.

అయోధ్య … ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ పుణ్యస్థలం. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రాంతమే అయోధ్య. ఇక్కడ రాములవారి ఆలయం నిర్మించాలనేది హిందువుల చిరకాల కోరిక. అనేక దశాబ్దాల కల నిజం కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా హిందువులందరి కల ఈ నెల 22న సాకారం కానున్నది. ఆ అమృత ఘడియల కోసం అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో శ్రీరామ చంద్రుల వారి మందిర నిర్మాణానికి అనేక అవరోధాలు, అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే వీటన్నిటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ…చివరకు రామమందిర నిర్మాణం ఒక రూపు దిద్దుకోబోతోంది. భారతదేశ చరిత్రలో అయోధ్య రామమందిర నిర్మాణం ఓ అద్భుత ఘట్టం. చిరస్మరణీయమైన సన్నివేశం. రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు అంటే అతిశయోక్తి కాదు.

అయోధ్య అంతా రామమయమవుతోంది. ఈ ఏడాది జనవరి 22న రామమందిర ప్రాణప్రతిష్టకు గడువు దగ్గర పడు తుండటంతో అయోధ్యా నగరం రామనామంతో మార్మోగుతోంది. ఎటు చూసినా శ్రీరామ నామాన్ని జపించే భక్తులే కనిపిస్తున్నారు. అంతేకాదు….స్థానికంగా దుకాణాలు, దీపస్తంభాలు….అన్నీ ఆధ్యాత్మిక కళను సంతరించుకున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఓ పవిత్ర కార్యం. రామ మందిర నిర్మాణ పనులు దాదాపుగా ముగింపు దశకు వచ్చాయి.అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా రామమందిర నిర్మాణం చివరి అంకానికి చేరుకుంది. అనేక దశాబ్దాల తరువాత అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చేపట్టింది ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. అయోధ్య రామమందిర నిర్మాణ పనులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులను పరుగులు పెట్టించి, పనులు చేయించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం అయోధ్యలో మూడు అంతస్తుల్లో రైల్వేస్టేషన్‌ ను నిర్మించారు. మొత్తంగా ఈ సముదాయానికి అయోధ్య థామ్ రైల్వే స్టేషన్‌గా పేరు పెట్టారు.

అయోధ్యలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయోధ్య వీథుల్లోని దుకాణాల షట్టర్లపై జై శ్రీరాం ….అంటూ గుర్తులతో కొత్త రంగులు వేస్తున్నారు. అంతేకాదు…షహదత్ గంజ్‌ నుంచి నయా ఘాట్ వరకు ఉన్న 13 కిలోమీటర్ల మార్గానికి రామ్ పథ్‌గా పేరు పెట్టారు. రామ్‌ పథ్ మార్గంలోని అన్ని దుకాణాల్లో అయోధ్య ఆలయ నమూనాలను అమ్ముతున్నారు. అలాగే అయోధ్య నగరంలోని ప్రధాన రహదారి థరమ్ పథ్‌కు రెండు వైపులా 40 సూర్య స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 30 అడుగుల ఎత్తు ఉన్న ఈ స్తంభాల శిఖర భాగాన సూర్యుడి ఆకారంలో అమర్చిన దీపాలు రాత్రివేళ కూడా సూర్యకాంతులు వెదజల్లుతున్నాయి. స్థానికులకు కనువిందు చేస్తున్నాయి.

అయోధ్యలో తెల్లటి మకరానా పాలరాయితో నిర్మించిన గర్భగుడిలో 51 అంగుళాల పొడవైన బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇదిలా ఉంటే అయోధ్య ఆలయ ప్రాంగణంలో మరో ఏడు గుడులు ఉంటాయి. ఈ ఆలయాల నిర్మాణం కోసం తెలంగాణ, కర్ణాటక నుంచి గ్రానైట్, రాజస్థాన్ నుంచి గులాబీ రాయి సేకరించారు. ఆలయ అవసరాల కోసం ప్రత్యేక నీటి శుద్ధీకరణ ప్లాంట్ సహా అన్ని ఆధునిక సదుపాయాలను సమకూర్చారు. అహ్మదాబాద్‌కు చెందిన సోంపూరా కుటుంబం రామమందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. చంద్రకాంత్ సోంపూరాను రామమందిర నిర్మాణ సూత్రధారిగా చెబుతారు. అయోధ్యలో రామమందిరంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.24 మెట్లు ఎక్కితే ఆలయ ప్రాంగణంలోకి చేరుకునే విధంగా నిర్మాణం చేపట్టారు.

రామమందిరం అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడుతోంది. ఆలయ పైభాగాన్ని కూడా ప్రత్యేక రీతిలో తీర్చి దిద్దు తున్నారు. ఇందుకు అనుగుణంగా పరిసర ప్రాంతాలను కూడా తీర్చిదిద్దుతున్నారు. త్రేతాయుగంలో అయోధ్య నగరం ఎలా ఉండేదో ప్రస్తుత యుగంలో అలాంటి అయోధ్య నగర నిర్మాణం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రమించింది. ఇదిలా ఉంటే రామమందిర ప్రాణప్రతిష్ట సమయాన, వంద అడుగుల స్తంభంపై ఝార్ఖండ్‌లోని హజా రీబాగ్‌కు చెంది న టైలర్ గులామ్ జిలానీ కుట్టిన జెండా రెపరెపలాడనుంది. ఆధ్యాత్మిక జెండాలకు పేరొందిన గులామ్ జిలానీ ప్రత్యేకం గా ఈ జెండా కుట్టారు. 40 అడుగుల పొడవు, 42 అడుగుల వెడల్పుతో ఈ జెండాను రూపొందించారు. ఈ జెండా కోసం 150 మీటర్ల వస్త్రం వాడారు. ఈ జెండా పై రామలక్ష్మణులు ఉంటారు. తాను కుట్టిన జెండాను రామ మందిరంపై అలంక రించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు టైలర్ గులామ్ జిలానీ.

అయోధ్య రామమందిర ప్రారంభంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కీలక కాబోతోంది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మంచి ముహూర్తం ఉందంటున్నారు జ్యోతిష్కులు. మొత్తంగా 84 సెకన్ల పాటు ఈ అద్భుత ముహూర్తం ఉందన్నది జ్యోతిష్యుల మాట. మొత్తం 84 సెకన్ల పాటు ఉండే ముహూర్తంలో అద్భుత శుభ గఢియలు ఉన్నాయంటున్నారు పండితులు. వావ్ …అనిపించే ఈ ముహూర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగితే ప్రపంచదేశాల్లో భారత్ పేరు మార్మోగుతుందంటున్నారు పండితులు. అంటే జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల ఎనిమిది సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ ఘడియ లున్నట్లు పండితులు తెలిపారు.

మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి యావత్ భారతదేశం ఎదురు చూస్తోంది. ఎప్పుడెప్పుడు జనవరి 22 వ తేదీ వస్తుందా ? ఎప్పుడెప్పుడు ఆ అపురూప దృశ్యాన్ని చూద్దామా అని భారతదేశ ప్రజలు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం తరుముకు వస్తోంది. దీంతో అయోధ్యకు రావడానికి దేశవ్యాప్తంగా శ్రీరాముడి భక్తు లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య…హాట్‌టాపిక్‌గా మారింది. అయోధ్యలోని హోటల్ గదుల రేట్లు భారీగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల హోటల్ గదుల రేట్లు వేలు దాటాయి. లక్షలకు కూడా చేరాయంటున్నారు హోటల్ యజమానులు.

అయోధ్యలో ప్రస్తుతం 30 వరకు హోటళ్లున్నాయి. వీటిలో మూడు మాత్రమే నాలుగు నక్షత్రాల హోటళ్లు. మిగిలినవన్నీ సెకండ్ స్టార్ లేదా థర్డ్ స్టార్ హోటళ్లే. పెద్ద ఎత్తున రామభక్తులు వస్తుండటంతో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్యలోనే కాదు….చుట్టుపక్కల గల పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని టూర్ ఆపరేటర్లు చెబుతు న్నారు. ఇదిలా ఉంటే, అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో శంఖనాదం కీలక కానుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా కేశవ్ శంఖనాద బృందానికి ఇటీవల ఆహ్వానం అందింది. కేశవ్ శంఖనాద బృందం అంటే దేశవ్యాప్తం గా పాపులర్. మహారాష్ట్రలోని పూణే కేంద్రంగా కేశవ్ శంఖనాద బృందం తన కార్యకలాపాలను నిర్వహి స్తుంది. ఈ బృందానికి నితిన్ మహాజన్ అనే వ్యక్తి సారథ్యం వహిస్తున్నారు. నితిన్ మహాజన్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల ఆహ్వాన పత్రిక పంపించారు. ఈ బృందానికి చెందిన 111 మంది అయోధ్యకు వెళ్లి అక్కడ శంఖనాదం కార్యక్రమం నిర్వహిస్తారు.

జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా సందడి చేయ బోతోంది. ఈ ప్రతిపాదిత కార్యక్రమానికి నేపాల్ నుంచి కానుకలు అందనున్నాయి. నేపాల్ నుంచి నగలు, పట్టు వస్త్రాలు, స్వీట్లు సహా అనేక ఇతర కానుకలు అయోధ్యకు రానున్నాయి. ఈ కానుకలను శ్రీరాముడికి సమర్పిస్తారు. నేపాల్ నుంచి వచ్చే కానుకలను రాములవారికి అందచేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. కాగా జనక్‌ పుర్‌థామ్ – అయో ధ్య ధామ్ యాత్రను చేపడతారు. జనవరి 12న ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 20వ తేదీన కానుక లను శ్రీరామ జన్మ భూమి రామ మందిర ట్రస్టుకు అందించడంతో యాత్ర ముగుస్తుంది. రాములవారికి కానుకులు పంపడానికి, పొరుగున ఉన్న నేపాల్‌కు ఒక సంబంధం ఉంది. గతంలో నేపాల్‌లోని కలిగంధకీ నదీ తీరంలో లభించే సాలగ్రామ శిలలను సేకరించి, రాములవారి విగ్రహాన్ని నిర్మించడానికి వాటిని అయోధ్యకు పంపారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం భారతదేశ చరిత్రలో అలాగే దేశ సాంస్కృతిక వారసత్వంలో ఒక మహోజ్వల ఘట్టం కాబోతోంది. అయోధ్య నగరం, ప్రభువు శ్రీరాముడి జన్మస్థలం. ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ అయోధ్య ఒక పవిత్ర నగరం. రామచంద్రులవారి సన్నిధిని భక్తులు చూడటానికి వీలుగా మందిర నిర్మాణాన్ని చేపట్టారు. రామ మందిర గోడలపై ఎటు చూసినా చిత్రలే కనిపిస్తాయి. శ్రీరాముడి జీవితాన్ని ప్రతిబింబించేలా కళాఖండాలు ఏర్పాటు చేశారు. రాములవారి గర్భగుడిలో మూడు అంతస్తులుంటాయి. భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, ఆధ్యా త్మికత శోభిల్లే విధంగా అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది.సింహద్వారం తరువాత ఆలయంలో ఐదు మండ పాలు దర్శనమిస్తాయి. రాములవారికి ఆంజనేయుడంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అందుకే గర్భ గుడికి ఎదురుగా హనుమాన్ విగ్రహం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అరవై లక్షల ఏళ్ల నాటి సాలిగ్రామ శిలతో రామలక్ష్మణుల విగ్రహాలను చెక్కించారు. వీటిని గర్భాలయంలో ప్రతిష్టిస్తారు. గర్భగుడిలో మూడు అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. సూర్యోదయం వేళ తొలి కిరణం శ్రీరాముడి విగ్రహంపై పడేలా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. సింహద్వారం దగ్గర అనేక స్తంభాలుంటాయి. వీటిలో ఒక్క స్తంభానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి స్తంభం మీద దేవతామూర్తుల ప్రతిమలు దర్శనమిస్తాయి. పవిత్రమైన ఈ రాళ్లను ఒక క్రమపద్ధతిలో రామమందిరాన్ని నిర్మిస్తున్నారు. ఐదు వందల మందికిపైగా సిబ్బంది అనునిత్యం రాత్రింబవళ్లు ఆలయ నిర్మాణం కోసం శ్రమిస్తున్నారు.

ఇదిలా ఉంటే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు ఆహ్వానం అందింది. కొంత మందికి ఆహ్వానం అందలేదు. అయితే ఆహ్వానం అందినవారే జనవరి 22న అయోధ్య రావాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కోరారు. ఆహ్వానాలు అందని వారు తరువాతి రోజుల్లో అయోధ్య వచ్చి రాముల వారి మందిరాన్ని సందర్శించుకోవచ్చని సూచించారు. రామమందిర నిర్మాణానికి అతి తక్కువ సమయంలో కోట్లాది రూపాయల విరా ళాలు వచ్చాయి. సంపన్న వర్గాలే కాదు…పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు కూడా రామమందిర నిర్మాణా నికి నిధులు ఇచ్చారు. రామచంద్రుడిపై తమ ప్రేమను చాటుకున్నారు.

రామమందిర ప్రారంభం తరుముకువస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అయోధ్య నగరాన్ని సందర్శిం చారు. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం రోజును దీపావళి పండుగల నిర్వహించుకో వాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చారు. మందిర ప్రారంభోత్సవం రోజున అందరూ ఇండ్లలో శ్రీరామ జ్యోతిని వెలిగించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌ను, విమానాశ్ర యాన్ని ప్రధా ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రధాని నరేంద్ర మోడీ ఐదు కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. రోడ్డు పొడవునా పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలి కారు. రోడ్ షో తరువాత రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్టేషన్‌ను రూ. 240 కోట్లతో తొలి దశలో అభివృద్ధి చేశారు. అయోధ్య విమానాశ్రయాన్ని శ్రీరాముడి జీవిత గాథ చిత్రాలతో తీర్చిదిద్దారు. రూ. 1450 కోట్లతో విమానా శ్రయ తొలిదశను నిర్మించారు. ఆరు వేల ఐదు వందల మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. ఏడాదికి పది లక్షల మంది ప్రయాణానికి వీలుగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. మొత్తానికి జనవరి 22న భారతదేశ చరిత్రలో ఓ మహోజ్వల ఘట్టం ఆవిష్కరణ కానుంది.

Latest Articles

అదానీ లంచం కేసు వ్యవహారంపై స్పందించిన వైట్‌హౌస్

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ చుట్టూ వివాదం అలముకున్న వేళ భారత్-అమెరికా మధ్య సంబంధాలపై అమెరికా స్పందించింది. తమ మధ్య సంబంధాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఇరు దేశాలు ఈ సమస్యను అధిగమిస్తాయని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్