Site icon Swatantra Tv

ఏలేరు వరద ఉధృతితో ముంపునకు గురైన గ్రామాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత YS జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏలేరు వరదలతో అతలాకుతలమైన గ్రామాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఆయన ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పదిన్నరకు పిఠాపురం చేరుకుంటారు. అక్కడినుంచి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం యు.కొత్తపల్లి మండలం నాగులపల్లికి వెళ్తారు జగన్‌. అక్కడినుంచి బయలుదేరి రమణక్కపేట వెళ్తారు. వరద బాధితులతో మాట్లాడిన తర్వాత తిరిగి పిఠాపురం చేరుకుంటారు. మధ్యాహ్నం పిఠాపురం నుంచి తాడేపల్లి తిరుగుపయనమవుతారు జగన్‌.

Exit mobile version