Site icon Swatantra Tv

తూర్పు దిగవల్లి గ్రామ వైసీపీ సర్పంచ్ భర్త అనుమానాస్పద మృతి

ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. వేణుగోపాల్ రెడ్డి సుమారు 30 కోట్ల వరకు ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ వేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు నుండి గ్రామంలో కనిపించని వేణుగోపాల్ రెడ్డి.. ఇండిపై రెండు రోజుల క్రితం పందెం రాయుళ్లు దాడి చేశారు. అయితే, ఇవాళ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version