Site icon Swatantra Tv

విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్‌ రోడ్‌ షో

విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఒకే వాహనంపై సిరిపురం కూడలి నుంచి బహిరంగ సభా వేదిక అయిన ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం వరకు రోడ్ షో నిర్వహించారు. రోడ్‌ షోలో నేతలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూలు చల్లుతూ ఆహ్వానించారు. మోదీ, చంద్రబాబు, పవన్‌ కళ్యణ్‌ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రధాని మోదీ టూర్‌ నేపధ్యంలో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

మొత్తం రూ.2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్‌లకు శంకుస్థాపన చేయనున్నారు.

Exit mobile version