Site icon Swatantra Tv

మోదీపై మండిపడ్డ కేజ్రీవాల్‌

ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆప్‌ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ఆపరేషన్‌ ఝాడు కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. ఆప్‌ను ముప్పుగా భావిస్తోన్న బీజేపీ తనకు బెయిల్‌ వచ్చినప్పటి నుంచి ఆపరేషన్‌ ఝాడు పేరుతో కార్యక్రమాన్ని మొదలు పెట్టిందన్నారు. ఆప్‌ నేతల అరెస్టులు, పార్టీ బ్యాంకు అకౌంట్లను సీజ్‌ చేయడం, ఆప్‌ కార్యాలయాలను మూసివేయించడం వంటివి అందులో భాగమే అని కేజ్రీవాల్‌ తెలిపారు. భిభవ్‌ కుమార్‌ అరెస్టుకు నిరసనగా బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు పార్టీ కార్యకర్తలతో బయలుదేరినప్పుడు కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version