పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో అంతర్జాతీయ చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు వచ్చారు. అంతర్జాతీయ చెస్ పోటీలు భీమవరంలో జరగటం అభినందనీయమని నాగేశ్వరరావు అన్నారు. పిల్లలలో మేధాశక్తిని పొందించడానికి చెస్ పోటీలు దోహదం చేస్తాయన్నారు. తల్లితండ్రులు తమ పిల్లల శక్తిని గుర్తించి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
భీమవరంలో అంతర్జాతీయ చదరంగం పోటీలు ప్రారంభం
