Site icon Swatantra Tv

కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మండిపడ్డ హరీష్‌రావు

   కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. 4 నెలలు కాలేదు..కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత మొదలైందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్‌ దగ్గర సరుకు లేదు. లీకులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ దొంగ మాటలు చెప్పి గద్దెనెక్కిందని, కాంగ్రెస్ వచ్చాకే రైతులకు కష్టాలు వచ్చాయని ఆరోపించారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేయొద్దని, ఆ పార్టీ పేదల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి బీజేపీ సహకరించలేదన్నారు. బీజేపీ రాముడి పేరుతో రాజకీయాలు చేస్తోందని మండిప డ్డారు. అబద్దాల్లో బీజేపీ బడేమియా. కాంగ్రెస్ చోటేమియా అని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తంచేశారు.

 

Exit mobile version