Site icon Swatantra Tv

ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది – హరీష్‌ రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు తాము భయపడేది లేదన్నారు. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ వేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఫార్ములా రేసింగ్‌ ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠ పెంచాలని కేటీఆర్‌ ప్రయత్నించారని అన్నారు. రేసింగ్‌తో రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప.. ఆయన తన సొంత ప్రయోజనాల కోసం ఏమీ చేయలేదన్నారు. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చారని కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు.

Exit mobile version