Site icon Swatantra Tv

ఈడీ దర్యాప్తు వేగవంతం

ఈరోజు చంచల్ గూడ జైలు లో నంద కుమార్ ను విచారించనున్నారు ఈడి అధికారులు.‌
నలుగురు అధికారులు బృందం మరి కొద్ది సేపటి లో చంచల్ గూడ జైలు కి చేరుకోనున్నారు.
ఎమ్మెల్యే లు కొనుగోలు కేసు కి సంబంధించి వంద కోట్ల రూపాయలు ప్రస్తావన రావడం తో విచారణ చేపట్టారు. నందకుమార్‌ను ఒకరోజు విచారణకు నాంపల్లి కోర్టు అనుమతించింది. మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) నమోదు చేసి ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి, సెవెన్‌హిల్స్‌ మాణిక్‌చంద్‌ ప్రొడక్ట్స్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ ఆవాలాను ఈడీ విచారించింది.

Exit mobile version