Site icon Swatantra Tv

సీఎం జగన్ అనంతపురం పర్యటన వాయిదా!

CM Jagan Mohan Reddy | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేపటి అనంతపురం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ పర్యటనను ఈ నెల 26కి వాయిదా వేసినట్లు సీఎంవో అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 26న అనంతపురం జిల్లా నార్పలలో సీఎం పర్యటించి.. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా రేపు ముస్లిం సోదరులకు జగన్ ప్రభుత్వం ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయనుంది. విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో నిర్వహించే ఇఫ్తార్‌ విందులో సీఎం జగన్ పాల్గొని ముస్లిం సోదరులతో ముచ్చటించనున్నారు.

అంతకముందు షెడ్యూలు ప్రకారం అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో రేపు (ఏప్రిల్ 17) సీఎం జగన్ పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి సంబంధించిన సభలో పాల్గొని లబ్ధిదారుల అకౌంట్ లలో డబ్బు జమచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. సీఎం పర్యటన వాయిదా పడటడంతో వైసీపీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం తగ్గినట్లయింది.

Exit mobile version