Site icon Swatantra Tv

అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలి – పవన్‌

అంతర్జాతీయ ప్రమాణాలతో ఏపీలో జూ పార్కులు అభివృద్ధి చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్. ఇకపై పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొన్న పవన్‌..కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలను సైతం భాగస్వామ్యం చేసేందుకు పవన్‌కల్యాణ్‌ చర్చలు జరిపారు.

Exit mobile version