Site icon Swatantra Tv

జగన్‌ మోహన్‌ రెడ్డితో వైవీ సుబ్బారెడ్ది భేటీ

వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డితో టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్ది భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి రాజీనామా వ్యవహారంపై చర్చించారు. నిన్న బాలినేని వైసీపీకి రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ నేతలతో జగన్‌ చర్చించారు. అలాగే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూపై హాట్ కామెట్స్‌ చేశారు. లడ్డూ ప్రసాదం వివాదంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

Exit mobile version