YS Avinash Reddy |మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ తనకు 160సీఆర్పీసీ నోటీసు అందించిందని.. ఆ నోటీసు ప్రకారం తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే లాయర్ సమక్షంలో విచారణ జరపాలని.. ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరారు. కాగా రేపు సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరుకావాల్సి ఉండగా.. ఆయన హైకోర్టును ఆశ్రయించండపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు తుదితీర్పు
Follow us on: Youtube Instagram