Site icon Swatantra Tv

కాసేపు మీ నీడ మాయం

ఎండ మనపై పడగానే పక్కనే మన ప్రతిరూపం ప్రత్యక్షమవుతుంది. మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా, కూర్చున్నా, నిల్చున్నా మన నీడ వెన్నంటే ఉంటుంది. మన కదలికలకు అనుగుణంగా నీడ ఆకారంలో మనల్ని ఫాలో అవుతుంటుంది. కానీ ఈ రోజు సరిగ్గా మిట్టమధ్యాహ్న వేళ మాత్రం ఓ అద్భుతం జరగనుంది. కాసేపు మన నీడ మాయం కానుంది. మిట్ట మధ్యాహ్న సమయంలో మన నీడ మాయం అవుతుంది. దీన్నే జీ రో షాడో డే అంటారు.

 హైదరాబాద్‌లో ఈ జీరో షాడో మధ్యాహ్నం 12.12 గంటలకు ప్రారంభమై.. రెండు, మూడు నిమిషాల వరకూ కొనసాగు తుంది. మేఘాలు కమ్ముకుని వర్షం కురిస్తే మాత్రం జీరో షాడో కనిపించే అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. అలాగే బెంగళూరులో మధ్యాహ్నం 12:17 గంటల నుంచి 12:23 గంటల దాకా ఈ ప్రకృతి వింత కనిపించే అవకాశం ఉంది. ఇలా ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. ఈ జీరో షాడో రోజు సూర్యుడు సరిగ్గా నడినెత్తిపై ఉంటే, నిటారుగా ఉండే మనిషి, జంతువు లేదా వస్తువు నీడ కనిపించదు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ సూర్య కిరణాలు నిటారుగా భూమి ఉపరితలంపై పడతాయి. దీనివల్ల మనుషులతోపాటు జంతువులు, వస్తువులు సహా నిటారుగా ఉండే ఆకారాల నీడ మాయం .

Exit mobile version