Site icon Swatantra Tv

అమెరికా ఫెడరల్ కోర్టు ఆరోపణలపై స్పందించిన వైసీపీ

అదానీ వ్యవహారంలో గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై వైసీపీ స్పందించింది. గత వైసీపీ ప్రభుత్వానికి అదానీతో ఎలాంటి సంబంధం లేదని ఎక్స్‌లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాత్రమే ఒప్పందం చేసుకుందని ఆ పార్టీ తెలిపింది. అదానీ గ్రూప్‌తో ఏపీ డిస్కమ్‌లు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం 7వేల మెగావాట్ల విద్యుత్‌్ను అత్యంత చౌకగా యూనిట్ 2.49 రూపాయల చొప్పున కొనుగోలు చేశామని తెలిపింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Exit mobile version