Site icon Swatantra Tv

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వం వహించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ పాపులారిటీ, వయస్సు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉందని ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని ఎన్డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విజయసాయిరెడ్డి అన్నారు. యువ రాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేడంటూ పరోక్షంగా సీఎం చంద్రబాబును ఉద్ధేశించి విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ను సీఎం పదవికి తగిన వ్యక్తిగా అభివర్ణిస్తూ విజయసాయిరెడ్డి చేసిన సంచలన ట్వీట్ వైరల్ గా మారింది.

Exit mobile version