Site icon Swatantra Tv

కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. పార్టీకి సంబంధించిన సోషల్‌ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులను ఖండించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్‌ ప్రజాసమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే.. అక్రమకేసులు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక కార్యకర్తలను అరెస్ట్‌ చేస్తున్నారని విమర్శించారు.

Exit mobile version