Site icon Swatantra Tv

తెలంగాణలో నేడు బీజేపీ సభ్యత్వ నమోదుపై వర్క్‌షాప్‌

ఇవాళ్టి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి విజయ రహత్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ షాప్ జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొననున్నారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది.

Exit mobile version