తిరుపతిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. ముత్యాలరెడ్డిపల్లిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. విటుడు, ఇద్దరు యువతులతో పాటు తల్లికొడుకును అదుపులోకి తీసుకున్నారు. వీరి గురించి ఆరా తీయగా పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవం తెలిసింది. వ్యభిచారం నిర్వహిస్తున్న వారు ఓ మహిళా SI తల్లి, తమ్ముడిగా తేలింది. ఏడాది క్రితం SIకి పెళ్లవ్వడంతో భర్తతో కలిసి వేరు కాపురం పెట్టింది. అయితే కూతురు తమను వదిలివెళ్లడంతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని.. దీంతో ఆదాయం కోసం పడుపు వృత్తి ఎంచుకున్నామని తల్లి తెలిపింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.