Site icon Swatantra Tv

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది – సబిత

మహిళలపై దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించడా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కొమురం భీం జిల్లా జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో గాయపడిన మహిళను పరామర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. రాష్ట్రంలో మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. వరుసగా రాష్ట్రంలో మహిళపై దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 8 నెలల్లో మహిళలపై 1,800 పైగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయన్నారు. వాటన్నింటిని ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. మహిళలంటే ఓ చులకనభావంగా పరిపాలన కొనసాగుతోందని అన్నారు. జైనూరు ఘటన చాలా బాధాకరమని అన్నారు. మహిళపై దారుణంగా దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

Exit mobile version