Site icon Swatantra Tv

బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా- మంత్రి రోజా

స్వతంత్ర వెబ్ డెస్క్:  టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని.. న్యాయపరంగా పోరాడుతానని మంత్రి ఆర్.కే.రోజా తెలిపారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బండారు లాంటి చీడపురుగులను ఏరిపారయేలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు మంత్రి రోజా.

మహిళలను కించపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది. చంద్రబాబు ఒకవేళ తప్ప చేయకుంటే జైలు నుంచి బయటికీ ఎందుకు రాలేకపోతున్నారని ప్రశ్నించారు మంత్రి రోజా టీడీపీ ఫెయిల్యూర్ ను డైవర్ట్ చేయడానికి తనను టార్గెట్ చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రోజా. టీడీపీ, జనసేనకు దిగజారుడు రాజకీయాలే తెలుసు అన్నారు. మాజీ మంత్రిగా పని చేసిన బండారు చాలా నీచంగా మాట్లాడారని.. తనకు ఊహ తెలిసినంత మాత్రాన ఎవ్వరూ ఇంతలా ఓ మహిళ గురించి మాట్లాడలేదన్నారు. మరీ రాష్ట్రంలో సీఎం జగన్ ఎలాంటి అవినీతికి తావులేకుండా చాలా అద్భుతంగా పథకాలను, ప్రణాళికలను అమలు చేస్తుంటే.. మాజీ సీఎం అభివృద్దిని అడ్డుకుంటున్నారని తెలిపారు.

Exit mobile version