Site icon Swatantra Tv

కేజ్రీవాల్ బెయిల్ … ఎన్నికలపై ప్రభావం చూపనుందా?

లోక్ సభ ఎన్నికల వేళ. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలునుంచి విడుదల కావడం ఓ సంచలనం.. “టైగర్ ఈజ్ బ్యాక్ ” అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పోస్టర్లు ప్రదర్శించింది. లోక్ సభ ఎన్నికల్లో పులి గర్జిస్తుందా! ప్రత్యర్థుల్ని వేటాడుతుందా తెలియదు కానీ.. ఢిల్లీ , పంజాబ్ లలో ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ ప్రచారంతో హోరెత్తించవచ్చు. ఇండియా కూటమికి కొత్త ఊపు ఇవ్వవచ్చు. కేజ్రీ వాల్ తన ప్రచారంతో ఏమేరకు ప్రభావం చూపుతారన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

ఆయనను 21 రోజుల పాటు విడుదల చేస్తే కేసుకు వచ్చే నష్టం ఏదీ లేదని కోర్టు వెల్లడించింది. కోర్టు తీర్పు. కేంద్ర ఏజెన్సీలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని చెప్పక చెబుతుందోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతు న్నారు. క్రిమినల్ ప్రొసీజర్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయరాదని, విచారణ పేరుతో ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయరాదని కోర్టు తీర్పు స్పష్టం చేయడంతో ఈ కేసులో ప్రజాస్వామ్య వాదన ప్రాధాన్యం సంతరించు కుంది. 2014, 2019లో ఢిల్లీలోని మొత్తం 7 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అప్పట్లో ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. ఈసారి పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి. 2024 లో బీజేపీ పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి వంటి ఆరోపణల నేపథ్యంలో ఓటర్లను ఎదుర్కొంటోంది. కేజ్రీవాల్ రంగ ప్రవేశం నేపథ్యంలో ఈ సారి ఢిల్లీలో ఎన్ని స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందో .

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మొదట ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతుగా లక్నో, 16న జెంషెడ్పూర్, 17న ముంబైలో ప్రచార సభల్లో పాల్గొంచారు. అనంతరం ఢిల్లీ పంజాబ్ లోనూ ప్రచారం చేనున్నారు. ఢిల్లీలో మే 25న ఎన్నికలు జరుగుతాయి. ఆమ్ ఆద్మీపార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా మూడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. పంజాబ్ లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కేజ్రీవాల్ దాదాపు 56 రోజులు జైలులో ఉండడం తో ఆమ్ ఆద్మీపార్టీ ప్రచారంలో స్తబ్దత నెలకొంది. ఇదే సమయంలో కేజ్రీవాల్ భార్య, మాజీ ఐఆర్ఎస్ అధికారి సునిత కేజ్రీవాల్ ఢిల్లీలోనే కాక గుజరాత్, పంజాబ్ లో ప్రచారం చేసినా దాని ప్రభావం అంతంత మాత్రమే. కేజ్రీవాల్ క్షేత్రస్థాయి ప్రచారానికి దిగడంతో ఢిల్లీలో రాజకీయవాతావరణం మరింత వేడెక్కింది.

ప్రధాని మోదీతో పోలిస్తే, కేజ్రీవాల్ గొప్పవక్త కాదు. చరిష్మా కూడా తక్కువే. అయినా ధైర్యం ఎక్కువ. నిజాయితీగా సమస్యలను ఎదుర్కొంటూ, బీజేపీకి లొంగక పోవడం తో చిక్కుల్లో పడ్డారు. అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ కు సానుభూతి పెరిగింది. “జైల్ కా జవాబ్ ఓట్ సే” అన్న ఆప్ నినాదం జనంలోకి వెళ్లింది. నియంతృత్వంతో తాను పోరాడుతున్నా నని కేజ్రీవాల్ ప్రకటించారు. మార్పు తెచ్చేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి అరంగేట్రం చేసిన ఆయన అవినీతి లేని పాలన అందించేందుకు సిద్ధమయ్యా రు. అయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ తో పెద్ద గందరగోళం లో ఆప్ చిక్కుకుంది. ఢిల్లీ డిప్యూటీసీఎం సిసోడియా అరెస్టై ఏడాది అయింది. కేజ్రీవాల్ ప్రచారం తర్వాత జూన్ 1న మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే. ఇలాంటి నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రచారం ఏమేరకు ప్రభావం చూపుతుంది. ఆప్ రాణిస్తుందా. ఇండియా కూటమికి మేలు జరుగుతుందాఅనేది వేచి చూడాల్సిందే.

Exit mobile version