Site icon Swatantra Tv

కవితకు బెయిల్ వస్తుందా?

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంకెన్నాళ్లు జైలులో ఉండాల్సి వస్తుందనే దానిపై బీఆర్ఎస్‌ నేతల్లో చర్చ జరుగుతోంది. ఆమె బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించడంతో వారిలో టెన్షన్‌ నెలకొంది. ఆమెకు ఇప్పట్లో బెయిల్‌ వస్తుందా అనే దానిపై కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన లో ఉన్నారు. నిన్న విచారణ సందర్భంగా అధికారులు కవితను వర్చువల్ గా కోర్టులో హాజరుపర్చారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో ఆరు రోజులపాటు మే 20వ తేదీ వరకు కస్టడీని పొడగించిన కోర్టు. తదుపరి విచారణ మే20కి వాయిదా వేసింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా కోర్టుకు ఈడీ తెలిపింది. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ ఛార్జిషిట్ దాఖలు చేశామని ఈడీ తెలుపగా మే20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జి షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై విచారిస్తామని కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే గతంలో సీబీఐ కేసులో కవితకు మే20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ అయ్యారు. రెండు దఫాలుగా 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. 14రోజులకు ఒకసారి కవిత జ్యూడీషియల్ కస్టడీని రెండు సార్లు కోర్టు పొడిగించింది. తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం సీబీఐ కేసులోనూ కవితకు జ్యూడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు విధించింది. సీబీఐ కేసులో కవిత జ్యూడీషియల్ కస్టడీని మే20 వరకు కోర్టు పొడిగించింది. ప్రస్తుతం ఈడీ కేసులోనూ మే 20 వరకు జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐల అరెస్ట్ లను సవాల్ చేస్తూ, బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యూలర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. అయితే, ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు లో కవిత సవాల్ చేసింది. ఢిల్లీ హైకోర్టు లో కవిత బెయిల్ పిటిషన్ పై మే 24న విచారణ జరగనుంది.

మరోవైపు తిహార్ జైల్ లో వారానికి రెండు సార్లు కవితతో ఆమె భర్త అనిల్ ములాఖత్ అవుతున్నారు. ప్రతిరోజు కవితతో ఐదు నిమిషాలు కుటుంబ సభ్యులు ఫోన్ లో మాట్లాడుతున్నారు. కవితకు ధైర్యం చెప్పడంతో పాటూ న్యాయపరంగా ముందుకెళ్లాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Exit mobile version