Site icon Swatantra Tv

తెలంగాణలో బీజేపీకి మెజారిటీ సీట్లు దక్కేనా ?

      లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండం చెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకవైపు ప్రజాగ్రహం కారణంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాదిలోగా కూలిపోతుందని ప్రచారం చేస్తున్నారు. కాగా మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్‌ను కూల్చివేయ డానికి బీజేపీ పక్కా ప్రణాళికతో సిద్ధం గా ఉన్నదని చెప్పడం. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ అగ్రనాయక త్వంపై కేసీఆర్ ఘాటు ఆరోపణలు చేశారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ సర్కార్‌ను ఎప్పుడె ప్పుడు కూల్చివేద్దామా అని హస్తినలోని కమలనాథులు కుట్రలు పన్నుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. 104 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే తమ ప్రభుత్వాన్ని పడగొట్ట డానికి బీజేపీ నాయకులు కుట్రలు చేశారన్నారు. అలాంటిది ప్రస్తుత రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌ను ఉపేక్షిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. మొత్తంమీద రేవంత్ రెడ్డి మొత్తం ఐదేళ్ల పాటు కొనసాగదన్న సంకేతాలు ఇచ్చారు కేసీఆర్.

  ఉత్తరాదిన బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ దక్షిణాన బలహీనంగా ఉంది. అంతేకాదు దక్షిణానగల ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీ సర్కార్ లేదు. పైపెచ్చు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమికి 400 సీట్లను టార్గెట్‌గా ఫిక్స్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇందులో భాగంగా దక్షిణాదిన మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడానికి పక్కా ప్రణాళిక తయారు చేసింది. కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అంతేకాదు ఓటమి తరువాత పులి మీద పుట్రలా గులాబీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ప్రారంభమైంది. గేట్లు ఓపెన్ చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో బీఆర్‌ఎస్ నుంచి వలసలు జోరందు కున్నాయి. ఒకదశలో బీఆర్‌ఎస్ ఖాళీ అవుతుందా ? అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటివరకు బీఆర్‌ఎస్ ఓట్‌బ్యాంక్‌గా ఉన్న సామాజికవర్గాలపై కమలం పార్టీ కన్నేసింది. ఎంపీ టికెట్లు ఆశపెట్టి పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.

   వాస్తవానికి నాలుగు నెలల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం బోలెడు ఆశలు పెట్టుకుంది. కేసీఆర్ పాలనపై వచ్చిన ప్రజా వ్యతిరేకత తమకు అనుకూలంగా మారు తుందని కమలనాథులు భావించారు. అయితే కమలనాథుల అంచనాలు తప్పాయి. పదేళ్ల కేసీఆర్ పాలనపై వచ్చిన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి వరంలా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజేతగా నిలిచింది. రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో అధికారంలోకి రాకపోయిన ప్పటికీ బీజేపీ ఓట్‌ బ్యాంక్ పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లలో విజయం సాధించింది. దీంత గులాబీ పార్టీ ఓట్ బ్యాంక్‌ను తమవైపునకు తిప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించు కుంది. ఇందులో భాగంగానే కొంతమంది గులాబీ పార్టీ నేతలను పార్టీలో చేర్చుకుంది.వీరిలో కొందరికి లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లు కూడా ఇచ్చింది.

   ఇదిలా ఉంటే, కొన్ని నెలల కిందట హైదరాబాద్‌లో జరిగిన ఎమ్మార్పీఎస్ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. అంతేకాదు ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్‌పై సంచల నాత్మక ప్రకటన చేశారు. ఎస్సీ రిజర్వేషన్‌కు బీజేపీ అనుకూలమని కుండబద్దలు కొట్టారు.దీంతో దళితు ల్లో ఒక సామాజికవర్గం పూర్తిగా తమకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాకు వచ్చింది కమలం పార్టీ. అంతేకాదు తెలంగాణలో సహజంగా వెనుకబడిన తరగతుల జనాభా ఎక్కువ. దీంతో బీసీ ఓట్‌ బ్యాంక్‌పై కమలం పార్టీ కన్నేసింది. వెనుకబడిన తరగతులకు చెందిన ప్రముఖ నాయకులను పార్టీలో చేర్చుకోవడంపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. ఇక్కడ మరో కీలక అంశాన్ని ప్రస్తావించుకుని తీరాలి.మజ్లిస్ పార్టీకి దుర్భేద్యమైన కోటలాంటి హైదరాబాద్ నియోజకవర్గాన్ని ఈసారి కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఓడించాలని కమలనాథులు కంక ణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు కొత్త అయిన మాధవీలతకు హైదరాబాద్ టికెట్ ఇచ్చి బరిలో దింపారు.

   ఒకటీ, రెండూ కాదు. తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాలను లోక్‌సభ ఎన్నికల్లో లక్ష్యంగా పెట్టు కుంది భారతీయ జనతా పార్టీ. సారాకే సారా సత్రా హమారా నినాదంతో జనంలోకి వెళ్లింది కమలం పార్టీ. కాగా తెలంగాణ బీజేపీ నాయకులతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతు న్నారు. నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఇటీవల తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని వరాలు ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు, సమ్మక్క – సారలమ్మ పేరుతో విశ్వవిద్యాల యం లాంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. దీంతో ఇవన్నీ తెలంగాణ సమాజంపై ప్రభావం చూపు తాయని కమలనాధులు భావిస్తున్నారు. తెలంగాణలో మెజారిటీ సీట్లు తమవేనన్న ధీమాతో ఉన్నారు కమలనాథులు.

Exit mobile version