YS Sharmila | సీఎం కేసీఆర్ మరోసారి నియంత అని నిరూపించుకున్నారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైవైస్ షర్మిల వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. జనతా రైడ్ లో భాగంగా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తుండగా వందల కొద్దీ పోలీసులను పంపించి అక్రమంగా నన్ను హౌజ్ అరెస్ట్ చేయించారని తెలిపారు. ఎలాంటి ఆర్డర్ లేకుండానే హౌజ్ అరెస్ట్ చేయడం.. కేసీఆర్ దుర్మార్గ పాలనకు నిదర్శనమని అన్నారు. గతంలో పాదయాత్రను అడ్డుకొని కూడా హౌజ్ అరెస్ట్ చేశారు.. మొన్న టీఎస్పీఎస్సీ ముట్టడికి వెళ్తుండగా హౌజ్ అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ కు అరెస్టులు తప్ప అభివృద్ధి చేతకాదని మండిపడ్డారు. వైయస్ఆర్ బిడ్డ అంటే ఎందుకంత భయం? ప్రజలపక్షాన ప్రశ్నిస్తుందనా? అంటూ ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రిలో రేకుల షెడ్డు కిందే వైద్యం చేస్తున్నా దొరకు సోయి లేదని.. 200కోట్ల ఉస్మానియా హెల్త్ టవర్ దిక్కు లేదని పేర్కొన్నారు.
వైయస్ఆర్ బిడ్డ అంటే ఎందుకంత భయం?: వై.ఎస్. షర్మిల
