Site icon Swatantra Tv

తెలంగాణ గడ్డపై త్రిముఖ పోరులో గెలుపు ఎవరిది ?

    తెలంగాణలో నువ్వా నేనా అన్న రేంజ్‌లో పార్లమెంట్ ఫైట్‌ నడుస్తోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే గెలుపు మాదంటే మాదని ఢంకా బజాయించి చెబుతున్నారు పార్టీ నేతలు. మరి ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు..? ఓటర్ నాడి ఎవరు బెస్ట్‌ అంటోంది..? విజయం ఎవరిని వరిస్తుంది..?

పదేళ్ల కేసిఆర్ పాలనను కాదని ప్రజలు తమ ఓటు హక్కుతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దీంతో ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది గులాబీ పార్టీ. అలాగే అధిక స్థానాలు సాధించి కేంద్రంలో హ్యాట్రిక్‌ కొట్టాలని.. మరోసారి మోదీని గెలిపించా లని తపనపడుతున్నారు కమలనాథులు. అలాగే తెలంగాణలో అధికారం చేజిక్కించుకుని ఫుల్ జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జోరును కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరు తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మే 13న తెలంగాణలోని 17 స్థానాల్లో జరిగే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండనుంది అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

పార్టీల గెలుపోటములకుపై సర్వేలు ఎన్ని చెప్పినా ప్రజలకు ఓ క్లారిటీ ఉంటుంది. గతంలో తాము గెలిపించిన నాయకుడి పని తీరు, సమస్యల పరిష్కారం ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రజలు ఓట్లేస్తారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యల మీద పార్లమెంటులో మాట్లాడతారని,.. కేంద్ర పథకాలను రాష్ట్రానికి వచ్చేలా చేస్తారని ప్రజలు పార్టీని కాదని అభ్యర్థిని చూసి ఓటు వేస్తారు. కానీ గెలిచిన వెంటనే అభివృద్ధి సాకు చెప్తూ సొంత లాభం కోసం నాయకులు పార్టీలు మారుతున్నారనే భావన ప్రజల్లో ఉంది. దీంతో త్వరలో జరిగే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలన్న అయోమయంలో ఉన్నారు జనం. ఈ క్రమంలోనే ప్రజల ఓట్లతో గెలిచిన నేతలు.. వారి స్వార్థ ప్రయోజనాలు కోసం పార్టీలు మారకుండా కఠిన చట్టాలు రావాలని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

      ఇక ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో ప్రచార జోరును పెంచాయి పార్టీలు. తమనే గెలపించాలని ఓటర్లను తమవైపుకి తిప్పుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే పదేళ్ల మోదీ పాలన, అభివృద్ధి చూసి ఓటు వేయాలని కలమనాథులు చెబుతుంటే, రాష్ర్టంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి తమకు ఓటేస్తే అభివృద్ధికి అడ్డు ఉందంటున్నారు హస్తం నేతలు. ఇక తెలంగాణ తెచ్చింది కేసీఆరేనని, ఎక్కువ సీట్లు బీఆర్‌ఎస్‌కు ఇస్తే కేంద్రంలో రాష్ట్రం కొట్లాడుతామంటోంది బీఆర్‌ఎస్‌. మరో వైపు ఎన్నికలు రాగానే ప్రతీ రాజకీయ నాయకుడు చెప్పే మాట ఒక్కటే. తమను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని భరోసా ఇవ్వడం. అయితే స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్తూ వస్తున్నారు కానీ, అది పూర్తిస్థాయిలో జరగడం లేదని, సామాన్య ప్రజల జీవితాలు నేటికి మారలేదని, ఆందోళనకరంగానే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజమైన అభివృద్ధి జరిగితే పేద, మధ్య తరగతి కుటుంబాల జీవితాలు కొంతైనా మెరుగుపడాయని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను కాదని కాంగ్రెస్‌కు పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు. మరో 5 ఐదేళ్లు దేశాన్ని ఏలే అధికారం ఎవరికి ఉందని భావిస్తున్నారు..? ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారు..? మోదీ పక్షాన ఉన్నారా..? కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version