Site icon Swatantra Tv

కామారెడ్డి మున్సిపల్ కొత్త చైర్‌పర్సన్‌ ఎవరు?

ఇవాళ కామారెడ్డిలో అవిశ్వాసంతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా దిగిపోయి కొత్త చైర్మన్ ఎన్నిక జరగనుంది. 60 ఏళ్ల కామారెడ్డి మున్సిపల్ చరిత్రలో మొదటిసారి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాసం పెట్టి దించేశారు. కాంగ్రెస్‌కి చెందిన 27 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా వారికి బిఆర్ఎస్ లోని తిరుగుబాటు వర్గానికి చెందిన పదిమంది కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో 35 ఓట్లు అవసరం ఉన్న పదవికి 37 ఓట్లతో చైర్‌పర్సన్‌ జాహ్నవిని గద్దెదించారు.

కామారెడ్డి మున్సిపల్ కొత్త చైర్‌పర్సన్‌గా దేవునిపల్లికి చెందిన కౌన్సిలర్ ఉర్దొండ వనిత పట్ల కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పెట్టిన ఆవిశ్వాసంతో చైర్‌పర్సన్ దిగిపోయాక కొత్త చైర్‌పర్సన్‌ ఎన్నికకు మున్సిపల్ అధికారులు, జిల్లా కలెక్టర్ జితేష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. చైర్ పర్సన్ పదవికి కాంగ్రెస్ పార్టీలో వనిత, ఇందుప్రియలు పోటీ పడడంతో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి వద్ద ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నాలు చేసింది. వనితను చైర్ పర్సన్‌గా ప్రకటిస్తే ప్రస్తుతం వైస్ చైర్మన్‌గా ఉన్న ఇందుప్రియ అదే పదవిలో కొనసాగుతారని పార్టీ వర్గాల అంచనా వేస్తున్నారు.

Exit mobile version