Site icon Swatantra Tv

బీజేపీ అమ్ములపొదిలో అస్త్రాలు

    ఈసారి లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. మేనిఫెస్టోకు సంకల్ప్‌పత్ర అంటూ పేరు పెట్టింది. ఢిల్లీలోని బీజేపీ హెడ్‌ ఆఫీస్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్య క్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా సహా పలువురు పార్టీ ప్రముఖులు మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా బీజేపీ సంకల్పపత్ర కోసం యావత్ భారతదేశం ఎదురుచూ సిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

రైతులు, పేదలు, మహిళలు, రైతులను లక్ష్యంగా చేసుకుని సంకల్ప్‌పత్రను రూపొందించింది మేనిఫెస్టో కమిటీ. రక్షణశాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్, మేనిఫెస్టో కమిటీకి నాయకత్వం వహించారు. ఈ కమిటీలో మొత్తం 27 మంది సభ్యులున్నారు. ఎన్నికల ప్రణాళిక కోసం ఈ కమిటీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. మేనిఫెస్టో కమిటీకి దాదాపు 15 లక్షల మంది తమ అభిప్రాయాలు పంపారు. ఈ సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రణాళికకు తుది మెరుగులు దిద్దింది రాజ్‌నాథ్‌ సింగ్ నాయకత్వంలోని కమిటీ. బీజేపీ మేనిఫెస్టోకు మోడీకీ గ్యారంటీ అంటూ పేరు పెట్టారు. పద్నాలుగు కీలక అంశాలతో ఎన్నికల ప్రణాళికను రూపొందించింది కమలం పార్టీ. మరో ఐదేళ్లపాటు ఉచిత రేషన్ పంపిణీకి టాప్ ప్రయారిటీ ఇచ్చింది. ఉచిత రేషన్ పంపిణీ చేయడం ద్వారా పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇండ్లు నిర్మిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది బీజేపీ. ఇండ్ల నిర్మాణం పథకం బీజేపీకి కొత్త కాదు. గతంలో కూడా పేదవర్గాలకు ఇండ్లు కట్టించే పథకాన్ని ప్రతిపాదించింది. అయితే ఆచరణకు వచ్చేటప్పటికి అనుకున్నస్థాయిలో ఇండ్ల నిర్మాణ పథకం విజయవంతం కాలేదు. పైప్‌లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ ఇస్తామన్నది మేనిఫెస్టలోని మరో కీలకాంశం. ఇది నిస్సందేహంగా మహిళలను ఆకట్టుకునే అంశమే. అయితే పైప్‌లైన్ ద్వారా గ్యాస్ అందచేసేంతటి టెక్నాలజీ మనదేశంలో ఉందా అనేదే ప్రశ్న.

న్నదాతలకు ఎంతో ఉపయోగకరమైన పీఎం కిసాన్ పథకానికి త్వరలో తెరపడుతుందన్న ఊహాగానాలు చాలాకాలంగా రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో ఈ అనుమానాలకు తెరదించుతూ పీఎం కిసాన్ పథకాన్ని పొడిగిస్తున్నట్లు ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసింది భారతీయ జనతా పార్టీ. సోలార్ ద్వారా ఉచిత విద్యుత్ మరో కీలకాంశం. సౌర విద్యుత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కొంతకాలంగా ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే డెబ్బయి ఏళ్లు పైబడ్డ వారికి ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి తీసుకువస్తామని క్లారిటీ ఇచ్చింది కమలం పార్టీ. ఈ పథకం అమలైతే సెవెంటీ ప్లస్‌కు ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సాయం లభిస్తుంది. అంతేకాదు..ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి ట్రాన్స్‌ జెండర్లను కూడా తీసుకువస్తున్నట్లు బీజేపీ ప్రకటించడం మరో విశేషం.

     ఉమ్మడి పౌరస్మృతికి తాము కట్టుబడి ఉన్నట్టు కమలం పార్టీ మరోసారి స్పష్టం చేసింది. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసి తీరుతామని కుండబద్దలు కొట్టింది. అయితే ఇది తొందరపాటు నిర్ణయమన్న విమర్శలు వస్తున్నాయి. ఏకాభిప్రాయం తరువాతే ఉమ్మడి పౌరస్మృతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వివాదాస్పదమైన ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రతిపాదనపై వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పింది. ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రతిపాదనపై ప్రాంతీయ పార్టీల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రాంతీయ పార్టీలే కాదు…దాదాపుగా దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రతిపాదనకు నో చెప్పాయి. అయినప్పటికీ ఈ అభ్యంతరాలను తోసిపుచ్చింది కమలం పార్టీ. ఒన్ నేషన్ – ఒన్ ఎలెక్షన్‌ ప్రతిపాదనను అమలు చేసి తీరుతామని క్లారిటీ ఇచ్చింది. రైతులను దృష్టిలో పెట్టుకుని పంటలకు మద్దతు ధరను పెంచుతామన్న హామీ కూడా ఇచ్చింది కమలం పార్టీ. అంతేకాదు వ్యవసాయరంగానికి మౌలిక వసతులు అందించడానికి సరికొత్తగా మిషన్ ప్రారంభిస్తు న్నట్లు వెల్లడించింది బీజేపీ మేనిఫెస్టో. వీటన్నిటితో పాటు తమిళభాషకు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహం లభించేలా చర్యలు చేపడతామని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ సంకల్పపత్ర పేర్కొంది.

Exit mobile version