Site icon Swatantra Tv

మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పని చేస్తాం- మోదీ

   ప్రజలు వరుసగా మూడోసారి సేవ చేసే అవకాశం ఇచ్చారని, ఈ దఫాలో మూడు రెట్లు అధికంగా పని చేస్తామని చేప్పారు ప్రధాని మోదీ. 18వ లోక్‌సభలో విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. జనహితం కోసం సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యంపై పడిన మచ్చకు రేపటితో 50 ఏళ్లు మోదీ గుర్తు చేశారు. 50 ఏళ్ల కిందట జరిగిన తప్పు మరెవరూ చేయ కూడదని ప్రధాని పేర్కొన్నారు. సామాన్య ప్రజల ఆకాంక్షలకు తగినట్లు పని చేయాలని కోరారు. ఈనేపథ్యం లోనే కొత్త లోక్‌ సభ సభ్యులకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం తో ముందు కు సాగాలని పిలుపునిచ్చారు.

Exit mobile version