Site icon Swatantra Tv

ఒంగోలులో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం-బాలినేని

ఎన్నికల ఫలితాలలో ఒంగోలులో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో అత్యధిక సీట్లు వైసిపి గెలుస్తుందని, అంతేకాకుండా రాష్ట్రంలో కూడా అధిక సీట్లు గెలిచి జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని అన్నారు. సర్వేలు నమ్మశక్యంగా లేవని ఒక్క రోజులోనే రకరకాల సర్వేలు రకరకాలుగా చెబుతున్నారని అవన్నీ కూడా ఫేక్ సర్వేలంటూ కొట్టిపారే శారు. వైసిపి అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version