Site icon Swatantra Tv

చిరంజీవి క్యారెక్టర్ బాగుందని పర్సనల్‌గా చెప్పారు: చైతన్యరావు

చైత‌న్య రావ్, భూమి శెట్టి జంట‌గా న‌టించిన సినిమా “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. నిన్న “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – మంచి సినిమా చేశామని మేము ఎంత చెప్పుకున్నా..మీరు ఇచ్చే చిన్న పాజిటివ్ రెస్పాన్స్ ఎంతో హెల్ప్ చేస్తుంటుంది. అలాంటి మౌత్ టాక్ మాకు ఇప్పుడు కావాలి. మీరు ఒకవేళ సినిమా చూసి ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమాకు మీడియా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు. మా జీఎస్ కే మీడియా అండగా నిలబడింది. నిన్న షో చూసి నా చిరంజీవి క్యారెక్టర్ బాగుందని పర్సనల్ గా వచ్చి చెప్పారు. రివ్యూస్ లోనూ నా బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చానని రాశారు. నాకు ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే నా ప్రతి సినిమాలోనూ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” ఒక మంచి సినిమా. ఈ సినిమా చూసేందుకు ఎలాంటి షరతులు లేవు. మీ దగ్గర్లోని థియేటర్ కు వెళ్లి చూడండి. రెండు గంటలు ఎంగేజ్ అవుతారు. అన్నారు.

దర్శకుడు అక్షర కుమార్ మాట్లాడుతూ – మా “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమాకు రిలీజైన అన్ని చోట్ల నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు తమ ఆదరణ చూపిస్తున్నారు. ఆర్టిస్టులకు మా సినిమాలోని క్యారెక్టర్స్ పేర్లు వచ్చేశాయి. చైతన్యను చిరంజీవి అని పిలుస్తున్నారు. మంచి సినిమాకు సక్సెస్ తప్పకుండా దక్కుతుందనే మా నమ్మకం నిజమైంది. మీడియా నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మౌత్ టాక్ పెరుగుతోంది. అన్నా మేము ఇవాళ ఈ థియేటర్ లో సినిమా చూస్తున్నామంటూ మెసేజ్ లు వస్తున్నాయి. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో ఎందరో తమ సహకారం అందించారు. వారందరికీ నా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

నిర్మాత డా. కృష్ణకాంత్ చిత్తజల్లు మాట్లాడుతూ – నాతో పాటు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన నా మిత్రులు నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండాకు థ్యాంక్స్ చెబుతున్నా. షరతులు వర్తిస్తాయి సినిమాకు మీరు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో చాలా హ్యాపీగా ఉన్నాం. మీడియా నుంచి మంచి రేటింగ్స్ వచ్చాయి. ఒక మంచి సినిమా చేశామనే సంతృప్తి నిర్మాతలుగా మాకు దక్కింది. సమాజానికి ఉపయోగపడేలా ఉంటూనే ఒక భర్తగా, ఒక మంచి ఫ్రెండ్ గా హీరోను ఆదర్శంగా చూపించాం. ఒక గుడ్ మెసేజ్ తో ఉన్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మా సినిమాకు మీ అందరూ మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అన్నారు.

నటుడు సంతోష్ యాదవ్ మాట్లాడుతూ – షరతులు వర్తిస్తాయి సినిమాకు మీరు చూపిస్తున్న ఆదరణ సంతోషాన్నిస్తోంది. ఈ సినిమాలో శంకరన్న క్యారెక్టర్ చేశాను. నా సుదీర్ఘమైన నట ప్రయాణంలో మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తైతే..ఈ శంకరన్న క్యారెక్టర్ మరో స్టేజీకి తీసుకెళ్లింది. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడే కథలో దానికున్న ఇంపార్టెన్స్ తెలిసింది. నాకు ఇంతమంచి రోల్ ఇచ్చిన దర్శకుడు అక్షరకుమార్ గారికి థ్యాంక్స్. షరతులు వర్తిస్తాయి సినిమాను ప్రతి ఒక్కరూ చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

నటీనటులు – చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ డైరెక్టర్ – గాంధీ నడికుడికర్
ఎడిటింగ్ – సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
సినిమాటోగ్రఫీ – ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – ప్రిన్స్ హెన్రీ
మ్యూజిక్ – అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల)
డైలాగ్స్ – పెద్దింటి అశోక్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – రాజేశ్ స్వర్ణ, సంపత్ భీమారి, అశ్వత్థామ
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
బ్యానర్ – స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రొడ్యూసర్స్ – శ్రీలత, నాగార్జున సామల, శారద, శ్రీష్ కుమార్ గుండా, విజయ, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు
రచన దర్శకత్వం – కుమారస్వామి (అక్షర)

Exit mobile version