Site icon Swatantra Tv

KTR: మేమంతా హరీశ్‌ వెంటే.. మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్

స్వతంత్ర వెబ్ డెస్క్: మంత్రి హరీశ్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలను రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఖండించారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి కేటిఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. మేమంతా మంత్రి హరీశ్ రావు వెంట ఉంటాం. పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్ రావు ఉన్నారు. హరీశ్ రావు బిఆర్ఎస్ మూలస్తంభంగా కొనసాగుతారు అని పేర్కొన్నారు.

కాగా సోమవారం తిరుమలలో మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు రబ్బరు చెప్పులతో వచ్చిన హరీశ్ రావు.. ఇప్పుడు అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. అభివృద్ధిలో మెదక్ జిల్లా వెనకబడటానికి కారణం హరీశ్ రావు అని మండిపడ్డారు. మెదక్ లో హరీశ్ రావు వేలు పెడితే.. తాను సిద్ధిపేటలో వేలు పెడతానని, సిద్ధిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని హెచ్చరించారు.

Exit mobile version