Site icon Swatantra Tv

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘విడుదల-2’

దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన “విడుదల 1” థియేట్రికల్ గా ఘన విజయం సాధించినప్పటి నుంచి సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. “విడుదల 2” సినిమా రిలీజ్ కోసం సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి. ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన “విడుదల 2” రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 20న ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఈ రోజు ప్రకటించారు.

“విడుదల” సినిమాతో చూస్తే మరింతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా “విడుదల 2” సినిమాను తీర్చిదిద్దారు దర్శకుడు వెట్రిమారన్. మహారాజ మూవీ తర్వాత విజయ్ సేతుపతి నటించిన సినిమాగా “విడుదల 2″పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. స్వరజ్ఞాని ఇళయరాజా సంగీతం “విడుదల 2” మూవీకి మరో ఆకర్షణ కానుంది. భవానీ శ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ లాంటి ప్రతిభావంతమైన నటీనటులు “విడుదల 2″లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నారు.

నటీనటులు – విజయ్ సేతుపతి, సూరి, భవానీ శ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – ఉత్తర మీనన్
సౌండ్ డిజైన్ – టి. ఉదయ కుమార్
స్టంట్స్ – పీటర్ హెయిన్, స్టంట్ శివ
వీఎఫ్ఎక్స్ – హరిహరసుదాన్
ఆర్ట్ డైరెక్టర్ – జాకీ
డీవోపీ – ఆర్ వేల్రాజ్
ఎడిటర్ – రామర్
మ్యూజిక్ – ఇళయరాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – ఎల్రెడ్ కుమార్
దర్శకత్వం – వెట్రిమారన్

Exit mobile version