Site icon Swatantra Tv

బీసీ కులగణనకు జీవో జారీ చేయడంపై వీహెచ్‌ హర్షం

కేంద్ర క్యాబినెట్‌లో బీసీ కులగణనకు జీవో జారీ చేయడంపై మాజీ ఎంపీ వీ హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంబర్పేటలో అలీ కేఫ్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ బీసీ వాడినని చెప్పడమే తప్ప చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. జీవో నంబర్ 18 విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి కులగనను చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు దీనిపై నోరు ఎత్తకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే బీసీ కులగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

Exit mobile version